సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేసి డిసాస్టర్ అందుకోవడమే కాదు, ఆచార్య బయ్యర్లకి బోలెడంత డబ్బు వెనక్కి కట్టి ఆర్థికంగానూ నష్టపోయాడు. ఆచార్య రిలీజ్ అయ్యి ఎనిమిది నెలలు పైనే అయినా కొరటాల ఇంతవరకు పబ్లిక్ లోకి వచ్చింది లేదు. ఇంకా ఇంకా ఆచార్య ఎఫెక్ట్ ని కొరటాల మోస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న ఎన్టీఆర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా కనబడుతున్నారు. అయితే ఆచార్య డిసాస్టర్ విషయంలో తప్పంతా కొరటాలదే అన్నట్టుగా చిరంజీవి మట్లాడారు. డైరెక్టర్స్ అందరిని కలిపి ఈమధ్యన కొంతమంది దర్శకులు సెట్స్ లోకి వచ్చాక డైలాగ్స్ రాసి నటులకి ఇబ్బంది కలిగిస్తున్నారంటూ సంచలనంగా మాట్లాడారు.. తర్వాత తూచ్ నేను కొరటాలని అనలేదు అన్నారు.
రీసెంట్ గా రామ్ చరణ్ కూడా సినిమాలు పోవడానికి ప్రధాన కారణం దర్శకులదే అంటూ కొరటాలని పాయింట్ అవుట్ చేసాడు. మరోసారి ఆచార్య ప్లాప్ లో కొరటాలని టార్గెట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సంచలన కామెంట్స్ చేసారు. అందరూ ఆచార్య రీ రికార్డింగ్ గురించి అడుగుతున్నారు. కానీ ఆచార్య లో రెండు పాటలు హిట్ అయ్యాయి వాటి గురించి ఎందుకు అడగరు అంటూ మణిశర్మ అలీ తో సరదాగా షో లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే తాను ఇచ్చిన BGM ని కొరటాల పక్కనపెట్టి మరో కొత్త వెర్షన్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
అదంతా కొరటాల చేసిన పనే. కొరటాలకి ఇష్టమైన BBM తో వెళ్లారు. చివరికి ఆచార్య ఫలితం మీరూ చూసారు అంటూ కొరటాల శివదే తప్పు అని మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ కూడా టార్గెట్ చెయ్యడం ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళనకి కారణమైంది.