Advertisementt

అనూకి అవకాశాల కొరత

Tue 29th Nov 2022 10:15 AM
anu emmanuel,telugu  అనూకి అవకాశాల కొరత
Tollywood taking light of Anu Emmanuel? అనూకి అవకాశాల కొరత
Advertisement
Ads by CJ

నాని మజ్ను తో హీరోయిన్ గా నిలదొక్కుకుందామనుకున్న అను ఇమ్మాన్యువల్ కి ఆ సినిమా సో సో హిట్ ఇచ్చినప్పటికీ.. తర్వాత స్టార్ అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. టాలీవుడ్ లోనే స్టార్ రేంజ్ ఉన్న అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు రావడంతో అను ఎగిరి గంతేసింది. అంతేకాదు లెక్కకు మించిన గ్లామర్ షో చేస్తూ అందాలు పరిచేసింది. అయినప్పటికీ అను ఇమ్మన్యువల్ అందాలను పట్టించుకోవడం అటుంచి రెండు సినిమాలు డిసాస్టర్ అవడంతో అను కి దిమ్మ తిరిగింది. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తో మహా సముద్రం చేస్తే అది ఆమెకి నిరాశనే మిగిలించింది. మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తో మెగా హీరో అల్లు శిరీష్ తో ఉర్వశివో రాక్షసివో అంటూ హడావిడి చేసింది.

ప్రమోషన్స్ లో మీడియా అడిగే ప్రశ్నలకు కాస్త చిందులు తొక్కుతూ సమాధానాలు ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో అను ఇమ్మాన్యువల్ దశ తిరిగిపోయింది అనుకున్నారు. ఆ సినిమాలో అను అల్లు శిరీష్ తో రొమాంటిక్ గా రెచ్చిపోయి హగ్గులు, కిస్సులు అంటూ హైలెట్ అయ్యింది. ఇక సినిమా హిట్ అయ్యింది. అనుకి అవకాశాలు వచ్చిపడతాయనే అనుకున్నారు. ఈ సినిమా ఇక్కడ హిట్ కొట్టగానే తమిళంలో కార్తీ సినిమా ఆఫర్ దక్కించుకుంది.

అయితే తెలుగులో మాత్రం అను కి అవకాశాలు ఇచ్చేవారు కరువయ్యారు. ఏ యంగ్ హీరో సినిమాకి ఆమెని ప్రిఫర్ చేసే వారు లేరు. ప్రెజెంట్ అయితే అను ఇమ్మాన్యువల్ ని సంప్రదించే తెలుగు దర్శకనిర్మాతలు ఎవ్వరూ కనిపించడం లేదు. పాపం అను హిట్ కొట్టినా పని జరగలేదు.

Tollywood taking light of Anu Emmanuel?:

 Anu Emmanuel lacks opportunities in Telugu

Tags:   ANU EMMANUEL, TELUGU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ