ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. రాజమౌళి ఇంటర్వూస్ కోసం నేషనల్ మీడియా పడి చచ్చిపోతుంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తో ప్రపంచానికి తెలుగు సినిమా ప్రత్యేకతని పరిచయం చేసిన రాజమౌళి తో సినిమా చెయ్యడానికి బాలీవుడ్ హీరోలు తహతహలాడుతున్నా పైకి చెప్పలేరు. కానీ రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కథ రాయడం మొదలు పెట్టినట్లుగా చెప్పి ఆసక్తిని క్రియేట్ చేసారు.
రాజమౌళి చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ మూవీ ఈవెంట్ కి హాజరయ్యారు. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మెరిశారు. ఆయన గెస్ట్ గా వస్తున్నారనగానే అందరిలో ఎంతో క్యూరియాసిటి. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ ఈవెంట్ లో ఆయన కనిపించడం, ఏం మాట్లాడతారో అనే ఆత్రుత అందరిలో కనిపించింది. దానికి తగ్గట్టుగానే రాజమౌళి కూడా మహేష్ మూవీపై స్పందించి మహేష్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసారు. నా నెక్స్ట్ మూవీ మహేష్ తో చేయబోతున్నాను, అది చాలా రోజుల తర్వాత ఇప్పటికి కుదిరింది. తాను ఎప్పటినుంచో ఓ అడ్వెంచర్ చిత్రం చేయాలి అనుకుంటున్నాను.
దానికి ఇప్పుడు సరైన సమయం దొరికింది అనుకుంటున్నాను, ఆ కథకి మహేష్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటారని ఆయనతో సినిమా చేస్తున్నాను, ఈ చిత్రం గ్లోబ్ టాటరింగ్ గా ఉండబోతుంది అంటూ రాజమౌళి మరోసారి మహేష్ మూవీపై ఆసక్తిని పెంచేశారు.