డీజే టిల్లు తో సూపర్ హిట్ కొట్టిన సిద్దు జొన్నలగడ్డ అలాగే నిర్మాత నాగ వంశీ కూడా డీజే టిల్లుకి సీక్వెల్ చేస్తామంటూ మొదలు పెట్టేసి అప్పుడే షూటింగ్ చేసేస్తున్నారు. అయితే డీజే టిల్లు లో హీరోయిన్ నేహా శెట్టి-సిద్దు జొన్నలగడ్డ మధ్యలో రొమాంటిక్ యాంగిల్ బాగా హైలెట్ అయ్యింది. నేహా శెట్టి నెగెటివ్ కేరెక్టర్ లో కనిపించింది. ఇక దర్శకుడికి కూడా టిల్లు తో బాగా పేరొచ్చింది. కానీ టిల్లు స్క్వేర్ కి వచ్చేసరికి హీరోయిన్ మారిపోయింది. దర్శకుడు మారిపోయాడు. కారణం సిద్దు జొన్నలగడ్డ అనే టాక్ ఉంది.
అదలా ఉంటే ముందుగా టిల్లు స్క్వేర్ కి హీరోయిన్ గా శ్రీలీల ని అనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత అదే టైం లో కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ని టిల్లు స్క్వేర్ కి హీరోయిన్ గా ఎంపిక చేసారు. కొద్దిమేర షూటింగ్ కూడా చేసాక ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా టిల్లు స్క్వేర్ నుండి తప్పుకుందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆమె ఎందుకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందో తెలియదు కానీ.. అనుపమ స్థానంలో అప్పుడే మరో హీరోయిన్ ని ఖరారు చేశారని సమాచారం.
మడోన్నా సెబాస్టియన్‌ను ఇప్పుడు టిల్లు స్క్వేర్ హీరోయిన్ గా ఫైనల్ చేశారని తాజాగా తెలుస్తున్న సమాచారం. మరి ఈ హీరోయిన్ అయినా చివరి వరకు ఉంటుందో.. లేదంటే మళ్ళీ మారుతుందా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం గమనార్హం.