బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇంకా మూడు వారాల గేమ్ మిగిలి ఉంది. చివరి మూడు వారలు పెద్దగా ఆసక్తి ఏం ఉంటుంది అనుకుంటే.. ఈ వారం నామినేషన్స్ హీట్ హౌస్ లో మంట లు రాజేసింది. అన్ని వారాలకన్నా ఈ వారం నామినేషన్స్ ఫైర్ మాములుగా లేదు. ఆది రెడ్డి vs రేవంత్, రేవంత్ vs ఫైమా, శ్రీహన్ vs ఆది రెడ్డి అబ్బో మాటల యుద్ధంతో నామినేషన్స్ ప్రక్రియ ఆల్మోస్ట్ ముగిసింది. ఇనాయ సుల్తానా కెప్టెన్ అయిన కారణంగా ఆమె సేవ్ అవ్వగా, శ్రీహన్ ని ఒక్కరే నామినేట్ చేసిన కారణంగా అతన్ని కూడా బిగ్ బాస్ సేవ్ చేసాడు. మిగతా ఆరుగురు నామినేషన్స్ లోకి వెళ్లారు.
రేవంత్, ఫైమా, ఆది రెడ్డి, కీర్తి, శ్రీ సత్య, రోహిత్ ఇలా వారు నామినేషన్స్ లో ఉండగా ఈ వారం ఇంటి నుండి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే గట్టిగా వినిపిస్తుంది. కారణం రెండు వారాల్లో ఎలిమినేట్ అవ్వాల్సింది ఇద్దరూ.. కానీ ఇంకా ముగ్గురు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. టాప్ 5 లోకి ఐదుగురు వెళితే మిగతా ముగ్గురు కంపల్సరీ ఎలిమినేట్ అవ్వాలి. కానీ రెండు వారాలే ఉన్నాయి. అందుకే డబుల్ ఎలిమినేషన్ చెయ్యాలా లేదా.. మారేదన్నా ట్విస్ట్ ప్లాన్ చెయ్యాలా అనే ఆలోచనలో టీమ్ ఉందట.
అంటే డబుల్ ఎలిమినేషనా.. లేదంటే వీక్ మిడిల్ లో ఒకరిని ఎలిమినేట్ చేద్దామా అని చూస్తున్నారట. రేపు మంగళవారం ఒక టాస్క్ పెట్టి ఒక హౌస్ మేట ని బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలి.