Advertisementt

ప్రభాస్-కృతి సనన్ మధ్యన ఏదో ఉందయ్యా..

Mon 28th Nov 2022 08:13 PM
prabhas,kriti sanon  ప్రభాస్-కృతి సనన్ మధ్యన ఏదో ఉందయ్యా..
Kriti Sanon and Prabhas in a relationship? ప్రభాస్-కృతి సనన్ మధ్యన ఏదో ఉందయ్యా..
Advertisement
Ads by CJ

ఇప్పుడు బాలీవుడ్ నుండి-టాలీవుడ్ వరకు ఒకటే హాట్ న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మధ్యన సం థింగ్ సం థింగ్ అనేది. వాళ్ళ మధ్యన డేటింగ్ రూమర్స్ ఇప్పుడు దావానంలా వ్యాపించాయి. అందులో బేడియా ప్రమోషన్స్ లో కృతి సనన్ మనసులో బాలీవుడ్ హీరో కాదు, అప్పుడప్పుడు ముంబై కి వచ్చి వెళ్లే హీరో ఉన్నాడు అంటూ అందరిలో ఆసక్తి రేపాడు వరుణ్ ధావన్. ప్రస్తుతం దీపికా పదుకొనే తో కలిసి ఆ హీరో నటిస్తున్నాడు అంటూ ఇండైరెక్ట్ గా ప్రభాస్ పై కృతి సనన్ ప్రేమపై కామెంట్స్ చేసాడు.

అంతేకాకుండా ప్రభాస్ మనసులో మరో యువరాణి ఉంది అంటూ అందరిలో అనుమానాలు రేకెత్తించాడు. ఇది ఇలా నడుస్తుండగా.. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబెర్ గా చెప్పుకుంటూ వివాదస్పద రివ్యూ లు ఇస్తూ అందరితో తిట్లు తినే ఉమైర్ సందు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రభాస్ ఆదిపురుష్ సెట్స్ లోనే కృతి సనన్ కి ప్రపోజ్ చేసాడు. ప్రస్తుతం వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అతి త్వరలో వారికి నిశ్చితార్థం జరుగుతుంది అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాని ఊపేస్తోంది.

అసలు ప్రభాస్-కృతి సనన్ మధ్యలో సం థింగ్ సం థింగ్ నడవడం కాదు, పరుగెడుతుందిగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఉమైర్ సందు చెప్పేవన్నీ నిజాలు కావు, అన్నీ అబద్దాలే, గతంలో సినిమాల రివ్యూస్ అంటూ చెత్త పోస్ట్ లు చేసే అతని మాటలు నమ్మలేం అంటూ కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు.

Kriti Sanon and Prabhas in a relationship?:

Prabhas and Kriti Sanon will be engaged very soon?

Tags:   PRABHAS, KRITI SANON
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ