ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ అవార్డును ప్రకటించడంతో సినీ ప్రముఖులతో పాటుగా, రాజకీయ ప్రముఖులు, ఆఖరికి పీఎం నరేంద్ర మోడీ కూడా మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. తాజాగా మెగాస్టార్ గోవాలో జరుగుతున్న 53 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఆయన భార్య సురేఖ తో కలిసి హాజరయ్యారు. అక్కడ గోవాలో మెగాస్టార్ చిరు ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు అందుకున్నారు.
ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడుతూ. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా. గతంలో ఓసారి ఈ అవార్డు వేడుకలకి హాజరయ్యాను, ఒకప్పుడు సౌత్ సినిమా, హిందీ సినిమా అనే ఎల్లలు ఉండేవి. ఇప్పుడు అంతా ఇండియన్ సినిమా అయ్యిపోయింది. నాకు యంగ్ హీరోలు పోటీ కాదు, నేనే యంగ్ హీరోలకి పోటీ.. అంటూ మెగాస్టార్ యువ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
అంతేకాకుండా నాకు వచ్చిన ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. నేను లైఫ్ లాంగ్ సినిమాలను వదిలిపెట్టను, ప్రాణం ఉన్నంతవరకు సినిమాల్లోనే ఉంటాను.. అంటూ చిరు స్పీచ్ ఇచ్చారు.