Advertisementt

ఏంటి శృతి ఈ అవతారం

Mon 28th Nov 2022 01:58 PM
shruti haasan  ఏంటి శృతి ఈ అవతారం
Shruti Haasan Selfie viral ఏంటి శృతి ఈ అవతారం
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా శృతి హాసన్ ఏ విషయమైనా ఓపెన్ గా డేరింగ్ గా మట్లాడుతూ వస్తుంది. తన అందమైన ఫోటోలని కాకుండా, డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. సినిమాలకి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చిన శృతి హాసన్ తర్వాత తన రూపంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అప్పట్లో పీరియడ్స్ తో ఫేస్ చేసే ప్రోబ్లెంస్ విషయాలను ఓపెన్ గా చెప్పింది. అలాగే మేకప్ లేని ఫొటోస్ ని షేర్ చేస్తూ అప్పుడప్పుడు అభిమానులకి కోపం తెప్పించే శృతి హాసన్ తాజాగా భయంకరమైన సెల్ఫీలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. శృతి హాసన్ షేర్ చేసిన సెల్ఫీస్ చూడగానే చాలామంది అసలు శృతి హాసన్ కి ఏమైంది అంటూ భయపడుతున్నారు.

ఎప్పుడూ అందంగా ఉండి, ఆమెని అలానే ఊహించుకునే అభిమానులు శృతి హాసన్ పిక్స్ చూసి కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. కళ్ళు ఉబ్బిపోయి, పెదాలు బూరెల్లా వాచిపోయాయి. తానెందుకు ఆ రూపంలోకి మారానో అంటూ శృతి హాసన్ ఆ విషయాలని కూడా రివీల్ చేసింది. తాను ఫీవర్, సైనస్ తో బాధపడుతున్నానని, అంతేకాకుండా పీరియడ్స్ లో ఉన్నానని ఓపెన్ కామెంట్స్ చేసింది. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో ప్రస్తుతం తన సెల్ఫీలు ఇలా ఉన్నాయని.. అయినా సరే తనను ఇలా ఈ లుక్ లో చూసి అంగీకరిస్తారని, పిక్స్ ఇష్టపడతారని అనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది.

అయితే లేడీస్ ప్రోబ్లెంస్ గురించి ఓపెన్ గా మాట్లాడే శృతి హాసన్ గట్స్ ని మెచ్చుకోవాలి, కానీ.. ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేసి అభిమానుల గుండెల్లో గునపాలు దించకమ్మ శృతి అంటూ ఆమె ఫాన్స్ ఆమెని గట్టిగా కోరుకుంటున్నారు.

Shruti Haasan Selfie viral:

Shruti Haasan shares Something Strange Happening

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ