జబర్దస్త్ లో ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న పంచ్ ప్రసాద్ త్వరలోనే నడుస్తాడని డాక్టర్స్ చెబుతున్నారు. ఇంతలోపులో మరో టాప్ కమెడియన్ ఆసుపత్రి పాలవడం కామెడీ ప్రియులకి షాకిచ్చింది. అదే ఆటో రామ్ ప్రసాద్ ఈ మధ్యన తలకి హాస్పిటల్ లో సర్జికల్ క్యాప్ పెట్టుకుని కనిపించడంతో జబర్దస్త్ ప్రేక్షకులు ఆందోళన పడుతున్నారు.
అయితే రామ్ ప్రసాద్ కి ఈమధ్యన ఆపరేషన్ జరిగినట్టుగా అతని ఫ్రెండ్ మరో కమెడియన్ గెటప్ శ్రీను బయటపెట్టాడు. ప్రస్తుతం రామ్ ప్రసాద్ క్షేమంగా ఉన్నాడని తెలుస్తుంది. సుధీర్ నటించిన గాలోడు సక్సెస్ సెలెబ్రేషన్స్ సమయంలోనే ఆటో రామ్ ప్రసాద్ కి ఆపరేషన్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకే రామ్ ప్రసాద్ ఆ గాలోడు ప్రమోషన్స్ లో కనిపించలేదు. కానీ దేనికి సర్జరీ అయ్యిందో తెలియరాలేదు. ప్రస్తుతం రామ్ ప్రసాద్ కి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అని చెబుతున్నారు. దానితో కామెడీ ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు.