యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కమిట్ అయ్యి సినిమాని ఓకె చేయించుకుని రెండేళ్లుగా వెయిట్ చేస్తున్న ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు ఎన్టీఆర్ ని వదిలేసి ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ లోనే సినిమా చెయ్యడానికి డిసైడ్ అయ్యాడు. ఉప్పెన తర్వాత బుచ్చిబాబుకి ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే కోరికని సుకుమార్ ద్వారా తీర్చుకుందామనుకుంటే.. ఎన్టీఆర్ ఇంకా రెండు సినిమాలు చేసేవరకు ఫ్రీ అవ్వడు, ఈలోపు నాలుగేళ్లు ఖాళీగా ఉండాలనే కారణంగా బుచ్చిబాబు రామ్ చరణ్ తో మూవీ ఓకె చేయించుకుని రేపు సోమవారం అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నాడు.
ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో కబడ్డీ ప్లేయర్ గా శ్రీకాకుళం నేపథ్యంలో బుచ్చిబాబు సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే కథతో రామ్ చరణ్ ని మెప్పించి బుచ్చిబాబు సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ కథతో రామ్ చరణ్ RC16 తో రంగంలోకి దిగబోతుంది అయితే పక్కా అంటున్నారు. మరి రామ్ చరణ్ ఇపుడు కబడ్డీ ప్లేయర్ కనిపించబోతున్నాడన్నమాట. అయితే బుచ్చిబాబు ఉప్పెన తర్వాత కూడా మైత్రి మూవీస్ మేకర్స్ లోనే చెయ్యాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తో బుచ్చిబాబు కొత్త ప్రొడక్షన్ హౌస్ లో సినిమాకి శ్రీకారం చుట్టాడు.