Advertisementt

రామ్ చరణ్ నుండి ఎగ్జైటింగ్ ఎనౌన్సమెంట్

Sun 27th Nov 2022 05:39 PM
ram charan,rc15  రామ్ చరణ్ నుండి ఎగ్జైటింగ్ ఎనౌన్సమెంట్
Ram Charan RC16 Locked And Loaded రామ్ చరణ్ నుండి ఎగ్జైటింగ్ ఎనౌన్సమెంట్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ RC 15 షూటింగ్ అలాగే పర్సనల్ వెకేషన్స్ అంటూ బిజీబిజీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో శంకర్ దర్శకత్వంలో RC 15 సాంగ్ షూటింగ్ లో హీరోయిన్ కియారా అద్వానీ తో స్టెప్పులు వేస్తున్న రామ్ చరణ్ నుండి రేపు అంటే సోమవారం ఉదయం ఓ ఎగ్జైటింగ్ ఎనౌన్సమెంట్ రాబోతుంది. అదే ఆయన నటించబోయే RC16 ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటి ఇవ్వబోతున్నారు. రామ్ చరణ్ RC15 తర్వాత చెయ్యాల్సిన గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆగిపోయింది. దానితో అయన తదుపరి ప్రాజెక్ట్ పై అందరిలో ఇంట్రెస్ట్ మొదలయ్యింది. 

ఈ లోపులో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు రంగంలోకి దిగాడు. సుకుమార్ హెల్ప్ తో రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. ఇదే సమయంలో రేపు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ అసోసియేట్స్ తో కలిసి కొత్త ప్రొడ్యూసర్ నిర్మించబోయే రామ్ చరణ్ సినిమా అధికారిక అనౌన్సమెంట్ రేపు నవంబర్ 28 ఉదయం 11.11 నిమిషాలకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. బుచ్చిబాబు తో చరణ్ చెయ్యాల్సిన ప్రాజెక్ట్ పైనే ప్రకటన వస్తుంది అంటూ మెగా ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 

మరోపక్క ఇంకా కొత్తగా ఏమైనా ఎనౌన్స్ చేస్తారేమో అనే ఉత్సుకత కూడా ఫాన్స్ లో కనిపిస్తుంది. మరి రేపు రాబోయే ప్రకటన కోసం మెగా ఫాన్స్ గంటలు, నిముషాలు లెక్కబెట్టేస్తున్నారు.

Ram Charan RC16 Locked And Loaded:

Mega Power Star Ram Charan film announcement at 11:11 am tomorrow

Tags:   RAM CHARAN, RC15
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ