రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ తో శ్రీలీల షూటింగ్ చేస్తుంది అనగానే పుష్ప పార్ట్ 2 షూటింగ్ జరుగుతుందేమో, పుష్ప పార్ట్ 2 లో శ్రీలీల కూడా నటిస్తుంది అనుకునేరు.. కాదు అల్లు అర్జున్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్ లో యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ యాడ్ లో శ్రీలీల కూడా నటిస్తుంది. లక్కీ హీరోయిన్ గా శ్రీలీల ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో బిజీ. ఇప్పుడు అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది అంటే మాములు విషయం కాదు. సినిమా కాకపోతేనేమి, యాడ్ అయితే ఏమిటి.. ఏదైనా స్టార్ హీరో పక్కన ఛాన్స్ వచ్చింది కదా. ఇక పుష్ప పార్ట్ 1 తర్వాత క్రేజీ గా అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ పెరిగిపోవడంతో పలు రకాల కంపెనీలు అల్లు అర్జున్ వెంట పడుతున్నాయి.
ఇప్పటికే ఈ ఏడాది నాలుగైదు యాడ్ షూట్స్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఈమధ్యనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ సుకుమార్ దర్శకత్వంలో మొదలయ్యింది. ఇంకా అల్లు అర్జున్ పుష్ప సెట్స్ లోకి అడుపెట్టలేదు. రీసెంట్ గానే భార్యతో సౌత్ ఆఫ్రికా టూర్ ఫినిష్ చేసి వచ్చిన అల్లు అర్జున్ మరోసారి రష్యా ఫ్లైట్ ఎక్కబోతున్నాడని అన్నారు. పుష్ప పార్ట్ 1 రష్యాలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చెయ్యడంతో అక్కడ సినిమాని ప్రమోట్ చెయ్యడానికి వెళుతున్నాడని అన్నారు.
దానిపై క్లారిటీ లేకపోయినా.. ప్రస్తుతం బన్నీ శ్రీలీల తో కలిసి యాడ్ షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాడని తెలుస్తుంది. బన్నీ-శ్రీలీల-త్రివిక్రమ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.