సూపర్ స్టార్ కృష్ణగారి పెద్ద కర్మ ని హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో నిర్వహించారు ఘట్టమనేని ఫ్యామిలీ మెంబెర్స్. ఈ రోజు ఆదివారం కృష్ణగారు మరణించి 13 రోజులు కావడంతో ఆయనకి శాస్త్రోక్తంగా పెద్ద కర్మ నిర్వహించి అభిమానుల కి స్పెషల్ గా భోజనాల ఏర్పాట్లు చేసారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుండి కృష్ణ గారి పెద్ద కర్మ కోసం ఐదు నుండి ఎనిమిదివేలమంది అభిమానులు వచ్చినట్టుగా తెలుస్తుంది.
అభిమానుల కోసం మహేష్ బాబు 32 రకాల స్పెషల్ వంటలను చేయించినట్టుగా తెలుస్తుంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ వంటలు అభిమానులకి వడ్డించిన వాటిలో ఉన్నాయి. అభిమానులకి పాస్ లు జారీ చేసి ఎవరూ ఇబ్బంది పడకుండా చూస్తున్నట్లుగా సమాచారం. మహేష్ బాబు అభిమానులని ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు, అలాగే ఆయన తోబుట్టువులు, కృష్ణగారి అల్లుళ్ళు, అది శేషగిరి రావు ఫ్యామిలీ, నరేష్ ఇలా ఘట్టమనేని ఫ్యామిలీతో పాటుగా ఇతర రిలేటివ్స్ కూడా కృష్ణగారి పెద్ద కర్మకి హాజరైనవారిలో ఉన్నారు.
N కన్వేషన్ లో రాజకీయ, సినీ ప్రముఖులకు మహేష్ బాబు స్పెషల్ గా విందు ఇస్తున్నారు. అభిమానులకి ఏర్పాటు చేసిన విందు లో మహేష్ పాల్గొని.. అక్కడ అభిమానులని కలుసుకున్న తర్వాత వెంటనే ఆయన N కన్వెన్షన్ కి బయలుదేరి వెళ్లారు. అక్కడ విందుకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
మామగారి ఫోటోకి నమస్కరించిన చిన్నల్లుడు సుధీర్ బాబు ఎన్నిజన్మలెత్తిన తాను కృష్ణగారి అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కృష్ణగారు అభిమానులు JRC లో జరిగిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.