Advertisementt

గొడవలు పడితే బ్రేకప్పేనా?

Sun 27th Nov 2022 01:25 PM
vishnu vishal,jwala gutta  గొడవలు పడితే బ్రేకప్పేనా?
Is it a breakup if there is a fight? గొడవలు పడితే బ్రేకప్పేనా?
Advertisement
Ads by CJ

గొడవలు పడుతూ కలిసుండాలా అంటూ చాలామంది ప్రేమని, పెళ్లిని బ్రేకప్ చేసుకున్న సందర్భాలను చాలా చూసాం. కొంతమంది అలాఉంటే.. ఇంకొంతమంది గొడవలు పడితే విడిపోవాలా.. సర్దుకుంటే పోలా అంటారు. అలాంటి వారిలో ఇప్పుడు హీరో విష్ణు విశాల్ ఉన్నాడు. అంటే కొన్ని కారణాలతో తన మొదటి పెళ్లి బ్రేకప్ అయితే టెన్నిస్ ప్లేయర్ జ్వాలా గుత్తాని విష్ణు విశాల్ ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే తన మొదటి పెళ్లి బ్రేకప్ అయినా, రెండో పెళ్లి తర్వాత జ్వాలా గుత్తా గురించి చాలా నేర్చుకుంటున్నా, తెలుసుకుంటున్నా, ముఖ్యంగా మన ప్రవర్తన బావుండాలి. అందరి జీవితాల్లో టెన్షన్స్ ఉంటాయి. కానీ ఒత్తిడిని తట్టుకుని ఎదుటి వారి ఫీలింగ్స్ అర్ధం చేసుకోవాలి.. అంటూ చెబుతున్నాడు.

నాకు జ్వాలాకి కూడా గొడవలవుతాయి. కానీ నేనే ముందు కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అవుతాను. అప్పుడు అది సర్దుకుంటుంది. ప్రతీ ఇంటిలో అబ్బాయి రాజీ పడితేనే సుఖం, సంతోషం ఉంటుంది. 

అంతేకాని గొడవ జరిగినంత మాత్రాన బ్రేకప్ అంటే కుదరదు అంటూ విష్ణు విశాల్ సంచలనంగా మాట్లాడాడు. భార్య, భర్త అంటే జీవితంగా సాఫీగా సాగుతుంది అని కాదు,  40 ఏళ్ళ కాపురంలో మా అమ్మ నాన్న చాలా గొడవలు పడ్డారు. అలాగని వారు విడిపోలేదు. వాటిని పరిష్కరించుకుని ఫ్యామిలీ ని లీడ్ చేస్తున్నారంటూ విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.

ఇక జ్వాలా గుట్టపైకి సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ఏదో ఓ సాంగ్ లో నటించినందుకు ఇప్పటికి ఫీలవుతుంది. నా లైఫ్, నా ప్రొఫెషన్ గురించి తను అర్ధం చేసుకుంది. నాకు అండగా నిలుస్తుంది అంటూ విష్ణు విశాల్ చెప్పుకొచ్చాడు.

Is it a breakup if there is a fight?:

Vishnu Vishal about Jwala Gutta

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ