పవన్ కళ్యాణ్ మూడేళ్ళ రాజకీయ జీవితానికి చిన్న బ్రేక్ ఇచ్చి వకీల్ సాబ్ అంటూ మళ్ళీ సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యారు. వేణు శ్రీరామ్ హిందీలో హిట్ అయిన పింక్ ని వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేసి మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్ ల్లో బిజీ అయినప్పటికీ.. ఇంతవరకు వేణు శ్రీరామ్ కొత్త ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ లేదు. వకీల్ సాబ్ హిట్ తో వేణు శ్రీరామ్ బిజీ అవుతాడని, ఆగిపోయిన ఐకాన్ అల్లు అర్జున్ తో మొదలు పెట్టేస్తాడనే ఊహాగానాలు చాలానే నడిచాయి. కానీ వేణు శ్రీరామ్ ఇంకా సైలెంట్ మోడ్ లో ఉన్నాడు.
మరోపక్క పవన్ కళ్యాణ్ తో మలయాళ రీమేక్ అయ్యప్పనం కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ చేసిన సాగర్ కె చంద్ర కూడా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్-రానాల కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ కూడా మంచి హిట్ అనిపించుకుంది. ఇంకేంటి సాగర్ కే చంద్రకి టాలీవుడ్ లో అవకాశాలే అవకాశాలు అని ఆయన కూడా కలలు కనే ఉంటాడు. కానీ ఆయన్ని పిలిచి సినిమా చేద్దామన్న హీరోనే కనిపించడం లేదు.
మరి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేశామని తృప్తి తప్ప తర్వాత వాళ్ళ కెరీర్ కి పవన్ సినిమాలు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదు అనేది వాళ్ళు తీసుకుంటున్న గ్యాప్ చూస్తే అర్ధమవుతుంది.