Advertisementt

ట్రీట్మెంట్ మార్చిన సమంత?

Sat 26th Nov 2022 08:48 PM
samantha,myositis,ayurvedic treatment  ట్రీట్మెంట్ మార్చిన సమంత?
Samantha now getting Ayurvedic treatment ట్రీట్మెంట్ మార్చిన సమంత?
Advertisement
Ads by CJ

సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకుంటుంది. దీని కోసం ఆమె అప్పట్లో విదేశాలకు వెళ్ళినట్లుగా కూడా వార్తలొచ్చాయి. సమంత కి నీరసం, అలసట, కళ్ళు తిరగడం, చర్మ సంబంధిత ఇబ్బందులు ఉండడంతో డాక్టర్స్ సూచన మేరకు ట్రీట్మెంట్ లో ఉంది. యశోద డబ్బింగ్ కూడా సెలైన్స్ ఎక్కించుకుంటూ చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే సమంత మాయోసైటిస్ థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లుగా ఈ మధ్యన సహా నటి కల్పిక గణేష్ బయటపెట్టింది.

అంతేకాకుండా రీసెంట్ గా క్రిటికల్ కండిషన్ లో సమంత ఇమ్మిడియట్ గా హాస్పిటల్ లో జాయిన్ అయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ సమంత మేనేజర్ మాత్రం సమంత హాస్పిటల్ జాయిన్ అవ్వలేదు, ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉంది, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లుగా.. ఇలాంటి గాలి వార్తలు ప్రచారం చెయ్యొద్దు అంటూ చెప్పాడు. అయితే ఇప్పుడు సమంత ఇంగ్లీష్ మెడిసన్ మానేసి ట్రీట్మెంట్ మార్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.

సమంత ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం చేయించుకుంటుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లీష్ మెడిసిన్ వలన మాయోసైటిస్ నయమవడం లేదని.. ఇలా ఆయుర్వేదానికి మారినట్లుగా, హైదరాబాద్ లోనే ఉంది లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర సమంత చికిత్స తీసుకుంటుందని గుసగుసలు వినబడుతున్నాయి.

Samantha now getting Ayurvedic treatment :

 Samantha is on the mend after being diagnosed with Myositis

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ