Advertisementt

బిగ్ బాస్ 6 : ఎలిమినేట్ అయిన రాజ్

Sat 26th Nov 2022 07:50 PM
raj,bigg boss 6  బిగ్ బాస్ 6 : ఎలిమినేట్ అయిన రాజ్
Bigg Boss 6 : Raj eliminated బిగ్ బాస్ 6 : ఎలిమినేట్ అయిన రాజ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 6 హౌస్ నుండి ఇప్పటివరకు 12 మంది బయటికి వెళ్లారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో ప్రేక్షకులు ఓ అంచనాకు ఎప్పుడో వచ్చేసారు. శ్రీ సత్య, ఫైమా, రాజ్ వీళ్లలో ఎవరో ఒకరు బయటికి వెళతారని ముందే ఫిక్స్ అయ్యారు. ఈ ముగ్గురు ఈ వారం ఓటింగ్ లో లీస్ట్ ప్లేస్ లో ఉన్నారు. కాకపోతే శ్రీ సత్యకి ఫ్యామిలీ వీక్ హెల్ప్ అయ్యి ఆమె కాస్త సేవ్ అయ్యేలా కనిపించింది. కానీ ఫైమా-రాజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.

ఈ రోజు శనివారం నాగార్జున ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ స్టేజ్ మీద కనువిందు చేసారు. గత సీజన్ కంటెస్టెంట్ సోహెల్ దగ్గర నుండి జబర్దస్త్ భాస్కర్, ఇంకా ఇనాయ ఫ్రెండ్స్, శ్రీహన్ ఫ్రెండ్స్ ఇలా చాలామంది స్టేజ్ పై సందడి చేసారు. అయితే రేపు రాబోయే సన్ డే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనేది లీకులు ద్వారా బయటికి వచ్చేసింది. ముఖ్యంగా ఫైమా, రాజ్ లు డేంజర్ జోన్ లో ఉండగా.. ఫైమా ఎవిక్షన్ ప్రీ పాస్ వాడి సేవ్ అవ్వగా.. రాజ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. 

గత వారం ఎలిమినేట్ అవ్వాల్సిన రాజ్.. బిగ్ బాస్ ఇచ్చిన చెక్ ఉపయోగించి నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఫ్యామిలీ వీక్ లో తల్లిని రప్పించాడు. కానీ ఈ వారం రాజ్ ఎలిమినేషన్ తప్పలేదు. బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి మంచి వాడిగా పేరు తెచ్చుకుని, ఫైమా తో ఫ్రెండ్ షిప్ తో హైలెట్ అయ్యి ఎలాగో 12 వారాలు గెంటేసి ఫైనల్ గా ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యాడు.

Bigg Boss 6 : Raj eliminated:

Raj evicted from Bigg Boss house

Tags:   RAJ, BIGG BOSS 6
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ