నటి పవిత్ర లోకేష్ తనపై వస్తున్న ట్రోలింగ్ పై, అసభ్యకరమైన పోస్ట్ లపై సైబర్ క్రైమ్ పోలీస్ లని ఆశ్రయించి ఫిర్యాదు చెయ్యడం సంచలనంగా మారింది. పవిత్ర లోకేష్ అలాగే నరేష్ పై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్ సైట్స్ లో పవిత్ర పై, నరేష్ పట్ల అసభ్యకరమైన పోస్ట్ లతో వేధిస్తున్నారని, ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారంటూ పవిత్ర తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే నరేష్-పవిత్ర లోకేష్ లపై రకరకాలుగా ప్రచారం జరిగింది.
కానీ కృష్ణగారి మరణంతో వీరి బంధం మరోసారి మీడియా లో హైలెట్ అయ్యింది. కృష్ణగారు ఆసుపత్రిలో ఉండగా ఆమెని నరేష్ తీసుకురావడం, అలాగే ఆయన భౌతిక కాయం దగ్గర ఆమెని ఉంచడం, అంతిమ యాత్ర సమయంలోను నరేష్ పవిత్రని జాగ్రత్తగా తీసుకురావడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా జరిగింది. పవిత్ర వలన కృష్ణ గారి ఫ్యామిలీ నరేష్ ని గౌరవించడం లేదు అని, వీరిద్దరూ చనిపోయిన దగ్గర అలా జంటగా తిరగడం అవసరమా.. చిన్నకర్మ రోజున వీరిద్దరూ కలిసి కృష్ణగారికి నమస్కారం చెయ్యడం ఇవన్నీ బాలేదంటూ పెద్ద ఎత్తున వారిపై నెగిటివిటీ చూపించారు నెటిజెన్స్.
దానితో పవిత్ర లోకేష్ మానసికంగా బాధపడుతూ.. తనపై, నరేష్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అసభ్యకర పోస్ట్ లపై ఆమె సైబర్ క్రైమ్ పోలీస్ లకి ఫిర్యాదు చేసింది. కొన్ని టివి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ లో అసభ్యకరమైన పోస్ట్ లతో వేధిస్తున్నారంటూ.. ఫిర్యాదు చెయ్యగా, ఆమె ఫిర్యాదుతో పోలీస్ లు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. పవిత్ర ఫిర్యాదు పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుగా పోలీస్ లు చెబుతున్నారు.