త్రివిక్రముడు మహేష్ తో చేస్తున్న మూవీ కోసం భారీ ఏర్పాట్లే చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ వెన్నంటే ఆయన పక్కనే ఉంటూ కనిపెట్టుకుని ఉంటున్నాడు. కృష్ణ గారి మరణం నుండి మహేష్ ని బయటపడేసేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే SSMB28 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టి మహేష్ ని పనిలో పడేస్తే.. కొద్దిగా కోలుకుంటారని చూస్తున్నారు. డిసెంబర్ 8 నుండి సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు పూజ హెగ్డే కూడా ఆ సమయానికి పూర్తిగా కోలుకుని SSMB28 సెట్స్ లో జాయిన్ అవుతుంది అని తెలుస్తుంది.
హీరోయిన్ గా పూజ హెగ్డే ని సెలెక్ట్ చేసిన త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీలని ఎంపిక చేసినట్లుగా ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి. ఆమెకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండేటట్లుగా స్క్రిప్ట్ మార్చారని అన్నారు. ఇప్పుడు ఆమె ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపించబోతుంది అని తెలుస్తుంది. అలాగే సీనియర్ హీరోయిన్స్ విషయంలో త్రివిక్రమ్ ఆలోచనలు ఎంత కొత్తగా ఉంటాయో అనేది టబు, నదియా, ఖుష్బూ, స్నేహ కేరెక్టర్స్ అప్పుడు చూసాం. ఇప్పుడు మహేష్ సినిమా కోసం మాజీ హీరోయిన్ శోభనని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే శ్రీలీల, శోభన లతో చర్చించి ఒప్పించారని, సెకండ్ షెడ్యూల్ తర్వాత వీరు షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ తో SSMB28 లో స్పెషల్ సాంగ్ డిజైన్ చేస్తున్నట్లుగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొంటుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.