Advertisementt

ప్రభాస్ కి కొత్త డార్లింగ్ ఉంది: బాలీవుడ్ హీరో

Sat 26th Nov 2022 02:17 PM
bollywood,hero varun dhawan,prabhas  ప్రభాస్ కి కొత్త డార్లింగ్ ఉంది: బాలీవుడ్ హీరో
Prabhas Love Life Exposed by Bollywood Hero ప్రభాస్ కి కొత్త డార్లింగ్ ఉంది: బాలీవుడ్ హీరో
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 40 ఏళ్ళు దాటిపోయినా పెళ్లి ప్రస్తావన లేకుండానే సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. గతంలో అనుష్క శెట్టి తో ప్రభాస్ ప్రేమాయణం నడపడమే కాదు, పెళ్లి చేసుకుంటాడనే రూమర్స్ నడిచినా ఇద్దరూ వాటిని కొట్టిపారేశారు. కానీ ఇప్పటివరకు ప్రభాస్, అనుష్క ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. అటు ప్రభాస్ పెదనాన్న కూడా ప్రభాస్ పెళ్లి కోసమై ఆరాటపడి వెళ్లిపోయారు. ఈమధ్యన ప్రభాస్ బాలీవుడ్ భామ, ఆదిపురుష్ హీరోయిన్ కృతి శెట్టిని ప్రేమిస్తున్నాడు, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.

తాజాగా కృతి సనన్, వరుణ్ ధావన్ లు తోడేలు మీడియా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ ప్రభాస్ లైఫ్ లో కొత్త డార్లింగ్ ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చెయ్యడంతో.. ప్రభాస్ నిజంగా ప్రేమలో ఉన్నాడా? ఉంటే ఆమె ఎవరు? అనే ఆసక్తి, ఆత్రుత అందరిలో బయలు దేరింది. కృతి సనన్ అయితే అవకాశం ఉంటే ప్రభాస్ పెళ్లాడతానంటూ మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది. ఇంకా వరుణ్ ధావన్ మట్లాడుతూ.. ప్రభాస్, కృతి ఇద్దరిదీ అందమైన జంట అంటూ పొగిడేసాడు. అయితే ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్-కృతి సనాన్ మధ్యన ప్రేమాయణం మొదలయ్యింది అనే ప్రచారం జరుగుతుంది.

కానీ ప్రభాస్, కృతి సనన్  ఈ డేటింగ్ రూమర్స్ ని ఖండించకుండా ఎంజాయ్ చేస్తున్నారు. దీనిని బట్టి వాళ్ళ మధ్యలో ఏం ఉంది అనుకోవాలి, ఏం లేదని కన్ ఫర్మ్ అవ్వాలో తెలియక నెటిజెన్స్ కన్యూజ్ అవుతున్నారు.

Prabhas Love Life Exposed by Bollywood Hero:

Bollywood Hero Varun Dhawan Hint On Prabhas Love Life

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ