నిన్న శుక్రవారం నవంబర్ 25న థియేటర్స్ లో తెలుగు స్ట్రయిట్ మూవీస్ తో పాటుగా డబ్బింగ్ సినిమాలు రెండు విడుదలయ్యాయి. గత వారం మాసూద సినిమా ప్రేక్షకులని మెప్పించగా.. ఈవారం అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నారు. అల్లరి నరేష్ నాంది బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంతో ఇంతో హైప్ ఉంది. కానీ ప్రమోషన్స్ మాత్రం వీక్ గా కనిపించడంతో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నట్టుగా అనిపించింది. అదే రోజు దిల్ రాజు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన లవ్ టుడే ని తెలుగులో డబ్ చేసి అల్లరి నరేష్ ప్రజానీకంపై సంధించాడు.
అదే సమయంలో మరో బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ లో తెరకెక్కిన వరుణ్ ధావన్ తోడేలు తెలుగులో డబ్ చేసి వదిలారు. ఈ త్రిముఖ పోటీలో అల్లరి నరేష్ డబ్బింగ్ సినిమాల ముందు చేతులెత్తేశాడు. లవ్ టుడే ఆల్రెడీ తమిళ్ లో హిట్ అవడంతో ఆ సినిమాకి తెలుగులో మంచి ఓపెనింగ్స్ రావడమే కాదు, క్రిటిక్స్ కూడా హిట్ రివ్యూస్ ఇచ్చేసారు. అలాగే వరుణ్ ధావన్ తోడేలు పర్లేదనిపించుకుంది. కానీ అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించినా ఆడియన్స్ ని రప్పించలేకపోయారు. అక్కడే తేడా కొట్టింది అనుకుంటే.. ఈ సినిమాకి సో సో టాక్ వచ్చింది. క్రిటిక్స్ కూడా అంతమాత్రం రివ్యూస్ ఇచ్చారు.
కొంతమంది రివ్యూర్స్ ని మ్యానేజ్ చేసినా.. బలమైన కంటెంట్ లేకపోతే సినిమాల గతి ఏమవుతుందో.. రీసెంట్ గా చాలా సినిమాల విషయంలో చూసాం. ఇప్పుడు మారేడుమిల్లి దానికి అతీతమేమి కాదు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మాత్రం డబ్బింగ్ సినిమా ముందు చేతులెత్తేసింది అనడానికి ఎలాంటి సందేహము లేదు.