బుట్టబొమ్మ పూజ హెగ్డే ఈమధ్యన కాలుకి ఫ్రాక్చర్ అవడంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. పూజ హెగ్డే ఎప్పుడు కోలుకుని మాములుగా అవుతుందో.. అప్పుడే మహేష్ తో త్రివిక్రమ్ చేయబోతే సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాలని త్రివిక్రమ్ చూసారు. అటు పూజ హెగ్డే విషయం తేలకుండానే కృష్ణగారు చనిపోవడంతో పూజ హెగ్డే కి కాస్త రెస్ట్ దొరికింది అనుకున్నారు. కానీ పూజ హెగ్డే ఇప్పటికి సరిగ్గా నడవలేకపోతున్న విషయం ఓ వీడియో చూస్తే తెలుస్తుంది. పూజ హెగ్డే నర్స్ సహాయంతో వాకర్ తీసుకుని నడుస్తున్న వీడియో అది.
పూజ సల్మాన్ ఖాన్-వెంకటేష్ కలయికలో తెరకెక్కుతున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో నటిస్తుండగా.. అక్కడ సెట్స్ లో పూజ హెగ్డే ఎడమ కాలుకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె డాక్టర్స్ సలహాతో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. పూజ హెగ్డే ఆ వీడియో తో పాటుగా.. తన ఇన్స్టా స్టోరీస్ లో నేను నా లైఫ్ లో రెండోసారి నడక నేర్చుకుంటున్నాను, ఇలా జరుగుతుంటే చాలా ఫన్నీగా ఉంది అంటూ రాసుకొచ్చింది.
పూజ హెగ్డే వాకర్ సహాయంతో నడుస్తున్న వీడియో మాత్రం క్షణాల్లో వైరల్ కాగా.. అది చూసిన వాళ్లు పూజ హెగ్డే ఇంకా కోలుకోలేదా అంటూ ఇంకా షాక్ లోనే ఉన్నారు.