బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంటర్ అయిన మూడు వారాలకే ఇంటిదారి పడుతుంది అనుకున్న ఇనాయ సుల్తానా.. ఇప్పుడు టాప్5 లోకి ఎంటర్ అవ్వబోతుంది. రెండు మూడు వారాల పాటు నెమ్మదిగా ఉంటూ, ఆట ఆడకుండా కనిపించిన ఇనాయ నాలుగో వారం నుండే పుంజుకుని ఆట మొదలు పెట్టడమే కాదు, అందరి మీద నోరేసుకుని పడిపోవడం, అనవసర విషయాల్లో కలగజేసుకుని హైలెట్ అవుతూ.. మొత్తానికి టాప్ 5 కి మార్గం సుగమం చేసుకుంది.
మూడో వారం నుండే కెప్టెన్సీ టాస్క్ లో పోరాడి ఆడుతున్న ఇనాయ సుల్తానా హౌస్ కి లాస్ట్ కెప్టెన్ గా అంటే ఫైనల్ కెప్టెన్ గా అవతరించింది. అయితే ఈ కెప్టెన్సీలో భాగంగా ఇనాయ సుల్తానా అందరితో వీరోచితంగా అంటే అబ్బాయిలతో కూడా పోరాడి గెలిచింది. కానీ అందులో ఒకళ్ళని ఈ టాస్క్ నుండి తప్పించే ప్రాసెస్ లో రోహిత్ ని పక్కన బెట్టడంతో అతను చాలా ఏడ్చేశాడు. చివరిలో సత్యతో కలబడి కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి హౌస్ కి చివరి కెప్టెన్ గా అవతరించింది.
నా కెప్టెన్సీలో మీకు ఫుడ్ తిన్నంత, మీకు నచ్చినట్టుగా ఉండండి అని చెప్పిన ఇనాయ.. అమ్మా చూసావా.. నేను కెప్టెన్ గా గెలవని కోరుకున్నావ్ గా సాధించాను అంటూ ఇనాయ కెమెరాల ముందు తన తల్లితో మాట్లాడింది.