Advertisementt

కాంతార ఓటిటి ఆడియన్స్ కి గుడ్ న్యూస్

Fri 25th Nov 2022 06:39 PM
kerala,varaha roopam song,kantara  కాంతార ఓటిటి ఆడియన్స్ కి గుడ్ న్యూస్
Good News For Kantara OTT Viewers కాంతార ఓటిటి ఆడియన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

అన్ని భాషల్లో ఒకే టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతార ఇప్పడు ఓటిటిలోకి వచ్చేసింది. థియేటర్స్ లో చెవులు మోగిపోయే BGM తో కాంతార చివరి 20 నిమిషాల కథ ఆడియన్స్ ని ఊపేసింది. ప్రేక్షకులు కుర్చీలకి అతుక్కుపోయేలా చేసిన వరాహ రూపం పాట పై కాపీ కాంట్రవర్సీ రావడంతో.. ఆ పాటలోని BGM మార్చి కాంతారని ఓటిటిలో తాపీగా రిలీజ్ చేసారు మేకర్స్. సినిమాకి ఆయువుపట్టైన ఆ సాంగ్ లేకపోవడంతో.. కాంతార కోసం వెయిట్ చేసి ఓటిటిలోకి రాగానే వీక్షించిన ప్రేక్షకులు నిరాశ పడిపోయారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ సాంగ్ BGM లేకపోతే సినిమా చూసినట్టుగా లేదు అంటూ ఒకటే కామెంట్స్ చేస్తున్నారు. 

వరాహా రూపం పాట ని కాపీ చేసారంటూ కేరళకి చెందిన తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ సభ్యులు కోర్టుకి వెళ్లారు. అందుకే ఆ పాటని ఓటిటిలో లేపేశారు. అయితే ఇప్పుడు నిరాశలో ఉన్న కాంతార ఓటిటి ప్రేక్షకులకి ఓ గుడ్ న్యూస్. అదేమిటంటే.. తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ వాళ్ళు వేసిన కేసుని కేరళలోని కోజికోడ్ కోర్టు కొట్టివేసింది. కానీ ఇంకా పాలక్కుడ్ కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. అక్కడ కూడా కోజికోడ్ కోర్టు మాదిరి తీర్పు వస్తే.. అంటే కేసు కొట్టివేస్తే.. మళ్ళీ వరాహా రూపం పాటని ఓటిటి కాంతారాలో యాడ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Good News For Kantara OTT Viewers:

Kerala Court Lifted Ban On Varaha Roopam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ