నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా, థాంక్యూ మూవీస్ ప్లాప్ అవడంతో కాస్త నిరాశ పడినా.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో కష్టడి మూవీ తెలుగు, తమిళం లో బైలింగువల్ మూవీగా చేస్తున్నాడు. నాగ చైతన్య బర్త్ డే సందర్భంగానే కష్టడి ఫస్ట్ లుక్ రివీల్ చేసారు మేకర్స్. అదలా ఉంటే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఆ తర్వాత సమంత విషయంలో, విడాకుల విషయంలో చాలా కూల్ గా స్టేబుల్ గా కనిపించాడు. తన లైఫ్ లో ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది అనే విషయం కూడా నాగ చైతన్యకు గుర్తు లేనట్టుగానే ప్రవర్తించాడు. మరోపక్క సమంత మానసిక ఒత్తిడికి లోనై మాయోసైటిస్ వ్యాధి బారిన పడింది.
నాగ చైతన్య సమంత తో విడాకుల తర్వాత కొద్ది నెలల గ్యాప్ తో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ న్యూస్ పై నాగ చైతన్య నుండి ఎలాంటి రిప్లై రాకపోయినా.. శోభిత మాత్రం చైతూ తనకి మంచి ఫ్రెండ్ అనే అర్థంలో మాట్లాడింది. అయితే తాజాగా శోభిత తో నాగ చైతన్య పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజెన్స్ వీరిద్దరూ డేటింగ్ లోనే ఉన్నారు.. ఇది కన్ ఫర్మ్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
డేటింగ్ లో కాదు.. ఈ పిక్ చూసాక వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనిపిస్తుంది, చైతూ ఏదో తేడా కొడుతున్నట్లుగా లేదూ అంటూ కామెంట్ చెయ్యడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. సమంత ఫాన్స్ మాత్రం నాగ చైతన్య ని ట్రోల్ చేస్తున్నారు.