Advertisementt

బిగ్ బాస్: గుండె పిండేసిన రేవంత్ ఎమోషన్

Fri 25th Nov 2022 01:37 PM
revanth,bigg boss 6  బిగ్ బాస్: గుండె పిండేసిన రేవంత్ ఎమోషన్
Revanth mother in the Bigg Boss house బిగ్ బాస్: గుండె పిండేసిన రేవంత్ ఎమోషన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఫ్యామిలీ వీక్ లో అందరి ఇంటి నుండి కుటుంబ సభ్యులు వచ్చారు.. ఎమోషన్స్ పండించారు.. కానీ రేవంత్ ఇంటి నుండి ఎవరూ రారన్నట్టుగా ఆయన భార్య అన్విత వీడియో కాల్ చేసినట్టుగా చూపించి రేవంత్ ని బాగా ఏడిపించిన బిగ్ బాస్, రేవంత్ ఎమోషనల్ గా బాధపడుతున్న సమయంలోనే ఆయన తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని పట్టుకుని ఏడ్చిన రేవంత్ కి ఆమె నువ్వు టెన్షన్ పడకు అంది.. దానితో శ్రీహన్ టెన్షన్ పడడు ఆంటీ.. పెడతాడు అంటూ ఆటపట్టించాడు. నువ్ కోపం తగ్గించుకో అని రేవంత్ కి తల్లి చెప్పడం హైలెట్ అయ్యింది. 

ఆ గెడ్డం కొద్దిగా తీసేయ్ నాన్న అనగానే.. తియ్యకూడదన్నారు అంటే.. లేదు తియ్యొచ్చట అని చెప్పగానే ఫేస్ వాష్ కని వెళ్లిన రేవంత్ నీట్ షేవ్ తో రాగానే అందరూ షాకైపోయారు. ఇప్పుడు బాగున్నావ్ అంటూ రేవంత్ తల్లి మెచ్చుకుంది. ఇక శ్రీహన్ -రేవంత్ ల స్నేహాన్ని పొగిడిన ఆమె ఎప్పటికి ఇద్దరూ అలానే ఉండండి అని చెప్పింది. తర్వాత కీర్తిని దగ్గరకి పిలిచి నీకు ఎవరూ లేరని ఎందుకంటావ్.. నేను నీకు అమ్మ లాంటి దాన్ని, మా ఇంటికి ఎప్పుడైనా రావొచ్చు.

నువ్ నాకు కూతురిలాంటిదానికి, కాదు కూతురివే అంటూ హాగ్ చేసుకుంది. తర్వాత ఆమె రేవంత్ ని హాగ్ చేసుకున్న ప్రతి సీన్ అందరిని ఎమోషనల్ గా కట్టి పడేసింది. చివరిలో లేట్ గా పిలిచినా రేవంత్ ఫ్యామిలీ ఎమోషన్ లేటెస్ట్ గా అనిపించింది.

Revanth mother in the Bigg Boss house:

Revanth Mother Entry In Bigg Boss 6

Tags:   REVANTH, BIGG BOSS 6
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ