మహేష్ బాబు ప్రస్తుతం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయారు. కృష్ణగారు చనిపోయి 11 రోజులు పూర్తవుతుంది. ఈ మధ్యలో కృష్ణ గారి అంత్యక్రియలు, ఆయన ఆస్తికల నిమజ్జనం, చిన్న కర్మ అంటూ మహేష్ కాస్త హడావిడిగానే ఉన్నారు. కృష్ణగారు ఆసుపత్రి లో ఉన్నప్పటినుండే దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ ని వదలకుండా వెన్నంటే ఉన్నారు. ఆయన లోన్లీ గా ఉండకుండా త్రివిక్రమ్ చూసుకున్నారు. ఇప్పుడు కూడా మహేష్ ఒంటరిగా ఉంటే.. తండ్రి ఆలోచనలతో సతమవుతాడు.. షూటింగ్స్ కి వస్తే.. కాస్త నలుగురిలో ఉన్నట్టుగా ఉంది. అందుకే షూటింగ్ కి రమ్మని చెబుతన్నారట.
SSMB28 సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేసి, త్రివిక్రమ్ తో కలిసి మహేష్ బాబు డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ లోకి వెళతారనే న్యూస్ వినిపిస్తుంది. మొదటి షెడ్యూల్ ని యాక్షన్ సీన్స్ తో ముగించిన తర్వాత కథ విషయంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని త్రివిక్రమ్ షూటింగ్ కి రెడీ అవుతున్న సమయంలో కృష్ణగారి మరణంతో SSMB28 షూటింగ్ కి బ్రేకులు పడేలా చేసింది. ఇప్పుడు మహేష్ కూడా షూటింగ్ కి సిద్దమవుతానని చెప్పినట్లుగా తెలుస్తుంది.
సో మరో వారంలో మహేష్ యాధస్థితికి వచ్చి షూటింగ్ కి వెళ్ళిపోతారని తెలిసి మహేష్ ఫాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.