రామ్ చరణ్ తో రెండోసారి జోడి కడుతుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. సౌత్ లో మహేష్ ఇంకా చరణ్ లు ఆమెకి సక్సెస్ లు ఇవ్వకపోయినా.. బాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా నిరూపించుకుని అక్కడ బిజీ అయిన తరుణంలో కియారా అద్వానీ మరోసారి చరణ్ తో సౌత్ కి రీ ఎంట్రీ ఇస్తుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్-కియారా అద్వానీ కలయికలో RC15 షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. అక్కడ విలాసవంతమైన భారీ సెట్ లో శంకర్ గా రిచ్ గా ఓ భారీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక నటులతో పాటుగా, రామ్ చరణ్-కియారాలు పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు షూటింగ్ స్పాట్ లో కియారా అద్వానీ, రామ్ చరణ్ కలిసి బర్గర్స్ తింటున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. వీరు మాత్రమే కాదు.. వీరితో పాటుగా వచ్చిన హెయిర్ స్టైలిస్ట్, కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఇంకొంతమంది టీం తో కలిసి చరణ్, కియారా లు ఈ బర్గర్స్ లాగిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ లోని భారీ బడ్జెట్ తో వేసిన సెట్ లో కొరియోగ్రాఫర్ బోస్కో ఆధ్వర్యంలో చరణ్-కియారా అద్వానీలపై ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుంది.