బిగ్ బాస్ సీజన్ 6 లో నాకు అబ్బాయిల టచ్ అంటే నచ్చదు అని అర్జున్ కళ్యాణ్ ని దూరం పెట్టిన శ్రీ సత్య శ్రీహన్ తో మాత్రం హగ్గులు లతో చెలరేగిపోతుంది. ఇనాయ తనని ఏదో అనేసింది.. నాకు బయట లవ్ ఉంది.. ఆమె ఏమనుకుంటుందో అంటూ బిల్డప్ ఇచ్చిన శ్రీహన్ కూడా శ్రీ సత్య తో తెగ ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. వీరిద్దరి వ్యవహారం బయట ప్రేక్షకులకి రుచించడం లేదు. తాజాగా శ్రీహన్ లవర్ సిరి హౌస్ లోకి అడుగుపట్టినప్పటినుండి శ్రీ సత్యని కాస్త అవాయిడ్ చేసినట్టుగా కనిపించింది. శ్రీహన్ నువ్వెంటో నాకు తెలుసు, పదేళ్ళుగా నిన్ను చూస్తున్నా.. సింగిల్ గా ఆడు, ఎమోషన్ అవ్వకు అంటూ సిరి, శ్రీహన్ కి హిత బోధ చేసింది.
ఇక సిరి శ్రీహన్ కి ముచ్చటగా మూడు ముద్దులు పెట్టింది. అంటే శ్రీహన్ మూడో ప్లేస్ లో ఉన్నాడనే హింట్ ఆమె అతనికి ఇచ్చినట్టుగా ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. అయితే సిరి ఇనాయ సుల్తాని తెగ పొగిడేసింది. ఈమధ్యన మావాడి మీద నీ కాన్సంట్రేషన్ తగ్గిందేమిటి అంటూ ఇనాయతో కామెడీ చేసింది. మరోపక్క సిరి.. శ్రీహన్ ని పక్కకి తీసుకెళ్లి.. అతనితో ఇలా చెప్పింది. గేమ్ పరంగా మాత్రం ఒక్కడివే ఆడు. అలానే ప్రేక్షకులకు నచ్చుతుంది. కేవలం గేమ్ మాత్రమే ఫోకస్ చేయి. దేని గురించి ఆలోచించకు.
నీకు ఎలా అనిపిస్తే అది చేయి.. గేమ్ లో ఎమోషన్స్ రానివ్వకు. నీకోసం మాత్రమే ఆడు అంటూ చెప్పడం చూస్తే.. శ్రీహన్ నువ్ శ్రీ సత్య నుండి దూరంగా ఉండి, ఆమెతో ఫ్రెండ్ షిప్ తగ్గించు, ఆమెతో ఉంటే నీ గేమ్ పోతుంది అని చెప్పకనే చెప్పేసింది.