Advertisementt

రేవంత్ ని బాగా ఏడిపించిన బిగ్ బాస్

Fri 25th Nov 2022 09:22 AM
bigg boss,singer revanth,anvitha  రేవంత్ ని బాగా ఏడిపించిన బిగ్ బాస్
Singer Revanth wife emotional post about Revanth రేవంత్ ని బాగా ఏడిపించిన బిగ్ బాస్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్స్ లో ఉన్న తొమ్మిదిమంది లో ఎనిమిదిమంది ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఆది రెడ్డి తో మొదలు పెట్టి ఇనాయతో ముగించారు. అది రెడ్డి వైఫ్ వస్తే, రాజ్ కి, ఇనాయకి, ఫైమకి వాళ్ళ తల్లులు వచ్చారు. ఇక శ్రీ సత్యకి ఆమె పేరెంట్స్ ఇద్దరూ వచ్చారు. శ్రీహన్ కి మాత్రం ఆయన గర్ల్ ఫ్రెండ్ సిరి వచ్చింది. ఆమెతో రొమాంటిక్ గా శ్రీహన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

ఇక కీర్తి భట్ కి ఆమె సహా నటుడు మహేష్ వచ్చాడు. అయితే ఇంతమంది వచ్చినా రేవంత్ ఇంటి నుండి ఎవరూ వచ్చినట్టుగా చూపించలేదు. అతని భార్య కానీ, అమ్మ కానీ రావాలంటూ రేవంత్ గట్టిగా కోరుకోవడం కాదు, ఎవరి పేరెంట్స్ హౌస్ లోకి వచ్చినా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ గా మారిపోతున్నాడు. అయితే రేవంత్ వైఫ్ అన్విత హౌస్ లోకి వచ్చినట్టుగా చూపించకుండా ఆమెని వీడియో రూపంలో చూపించారు. వీడియో కాల్ లో ఉన్నట్లుగా రేవంత్ అతని భార్య అన్విత తో మాట్లాడుతున్న టైమ్ లో ఆ వీడియో కాల్ కట్ అవడంతో రేవంత్ మరింతగా ఎమోషన్ అయ్యాడు. 

బిగ్ బాస్ ప్లీజ్ నా భార్య తో మాట్లాడించారా అంటూ వెక్కి వెక్కి ఏడవడం చూసిన వారు.. బిగ్ బాస్ రేవంత్ ని మరీ అంతలా ఏడిపించి ఫైనల్ గా ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తారేమో అంటున్నారు. అంటే భార్యని తల్లిని ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారేమో అందుకే ఆ వీడియో కాల్ కట్ చేసి రేవంత్ ని ఏడిపించారని అనుకుంటున్నారు.

Singer Revanth wife emotional post about Revanth:

Bigg Boss contestant singer revanth wife anvitha emotional video

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ