Advertisementt

ఉపేంద్రకి అస్వస్థత: విషయం ఏమిటంటే..

Thu 24th Nov 2022 08:29 PM
kannada hero upendra,upendra hospitalised  ఉపేంద్రకి అస్వస్థత: విషయం ఏమిటంటే..
Kannada hero Upendra hospitalised ఉపేంద్రకి అస్వస్థత: విషయం ఏమిటంటే..
Advertisement
Ads by CJ

కన్నడ హీరో ఉపేంద్ర షూటింగ్ స్పాట్ లో అస్వస్థతకి గురయ్యారు. దానితో ఆయన్ని చిత్ర బృందం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనపడిపోతున్నారు. అసలు ఉపేంద్రకి ఏం జరిగింది అంటే.. ఉపేంద్ర మోహన్ బి కేరే స్టూడియోలో యూఐ సినిమా షూటింగ్ చేస్తుండగా.. అక్కడ సెట్స్ లో దుమ్ము, ధూళి కారణంగా ముక్కు మూసుకుపోవడంతో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడిన ఉపేంద్రని వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ ని రప్పించి ఫస్ట్ ఎయిడ్ చేయించినట్లుగా తెలుస్తుంది.

తర్వాత ఆయన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించగా.. అయన వెంటనే కోలుకుని మళ్ళీ షూటింగ్ స్పాట్ కి వచ్చేసారు. కానీ అభిమానులకి అసలు విషయం తెలియక ఆందోళపడుతున్నారని తెలిసిన ఉపేంద్ర.. వెంటనే ఓ వీడియో ని వదిలారు. ఉపేంద్ర ఆ వీడియో లో తాను క్షేమంగానే ఉన్నాను, ప్రస్తుతం షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నాను. అంతా నా దగ్గరే ఉన్నారు. మళ్లీ షూటింగ్‌ ప్రారంభిస్తానని, సెట్స్ లో దుమ్ము. దుమ్ము ధూళి పొగలు అలుముకున్నాయని తెలిపారు. 

చిన్న సమస్య తప్ప.. తనకి ఎలాంటి ఇబ్బంది లేదు అని, దయచేసి వేరే వార్తలను ప్రచారం చేయకండి అంటూ ఉపేంద్ర ఆ వీడియోలో కోరారు..

Kannada hero Upendra hospitalised :

Upendra hospitalised after developing breathing issues

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ