Advertisementt

రశ్మిక మందన్నపై చర్యలు?

Thu 24th Nov 2022 07:41 PM
kannada,rashmika mandanna  రశ్మిక మందన్నపై చర్యలు?
Action against Rashmika Mandanna? రశ్మిక మందన్నపై చర్యలు?
Advertisement
Ads by CJ

కన్నడ నుండి బాణంలా దూసుకొచ్చి.. తెలుగులో లక్కీ గర్ల్ గా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా వున్న రష్మిక ఈ మధ్యన వివాదంలో ఇరుక్కుంది. తనకి కన్నడలో ఫస్ట్ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలు పేరు పెట్టి పిలిస్తే అవమానము అన్న రేంజ్ లో ఓ ఈవెంట్ లో తనకి ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ మాట్లాడి వివాదానికి తెర లేపింది. కన్నడలో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతారా సినిమా చూడలేదు.. తాను బిజీగా ఉండడం వలన సమయం పెద్దగా దొరకడం లేదు అంటూ మాట్లాడడంతో ఆమెపై నెటిజెన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఆ ట్రోలింగ్ తో రష్మిక మదనపడిపోయి.. ఓ పోస్ట్ పెట్టింది. అప్పటికే రశ్మికకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక తర్వాత ఓ ఇంటర్వ్యూలో సోకాల్డ్ ప్రొడక్షన్స్ తనకు మొదట అవకాశం అంత తేలిగ్గా ఇవ్వలేదు, నేను మోడల్ గా ఉన్నప్పుడు ఒక మ్యాగజైన్ పై వచ్చిన ఫోటో చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పింది. మరి రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. రక్షిత్ శెట్టి దర్శకత్వంలో, హీరోగా ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి తో కిరాక్ పార్టీలో నటించింది. అలాగే ప్రొడక్షన్ కంపెనీ కూడా చిన్నదేమీ కాదు. పేరున్న సంస్థ.

దానితో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. రిషబ్ శెట్టి రశ్మికపై ఇండైరెక్ట్ గా అదిరిపోయే కౌంటర్ వేసాడు. బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. రష్మిక పేరు తియ్యకుండా సమంత, సాయి పల్లవితో పని చేస్తాను అని, కొంతమంది నటీనటులతో నటించడం తనకి ఇష్టం ఉండదు అని రష్మిక మందన్న చూపించిన హావభావాలను రిషబ్ ఆ ఇంటర్వ్యూలో ఇమిటేట్ చేశాడు. అదలా ఉంటే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ లోని నిర్మాతల మండలి రష్మిక మందన్న పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రష్మిక ఏ భాషలో నటించినా ఆమెకి సంబంధించిన సినిమాలను కన్నడలో రిలీజ్ చేయనివ్వకూడదు, అంతేకాకుండా ఆమెపై బ్యాన్ విధించాలి అని కన్నడ ఇండస్ట్రీ నిర్మాతల సంఘం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది.

Action against Rashmika Mandanna?:

Kannada film industry will soon going to take an action on Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ