ఈ రోజు గురువారం ఉదయం నటుడు కమల్ హాసన్ హుటాహుటిన పోరూర్ రామచంద్రన్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళనపడిపోయారు. నిన్న బుధవారం గురువు కె విశ్వనాధ్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉన్నట్టుండి ఆసుపత్రిలో అడ్మిట్ అవడంతో ఆయనకి ఏమైందో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే కమల్ హాసన్ తీవ్రమైన జ్వరం, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ఆయనని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేసారు.
ఇంకా కమల్ హాసన్ ఆసుపత్రిలో ఉన్నట్లుగా డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. కమల్ హాసన్ కి అన్ని రకాల టెస్ట్ లు చేశామని, ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నారు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయన మరో రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంటారు, తరవాతే ఆయన్ని డిశ్ ఛార్జ్ చేస్తామని పోరూర్ రామచంద్రన్ ఆసుపత్రి వైద్యులు కమల్ హెల్త్ బులియన్ విడుదల చేసారు.