Advertisementt

తండ్రి మృతిపై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్

Thu 24th Nov 2022 04:13 PM
mahesh babu,krishna  తండ్రి మృతిపై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu rains love showers on his dad Krishna తండ్రి మృతిపై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ కృష్ణ మరణానంతరం ఇంత వరకు ఎక్కడా రియాక్ట్ అవ్వని సూపర్ స్టార్ మహేష్ బాబు.. తొలిసారి ట్విట్టర్ వేదికగా ఓ భావోద్వేగ లేఖను షేర్ చేశారు. కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ, ఆయనని మరింత గర్వపడేలా చేస్తానని ఇందులో ఆయన మాటిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 15న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో ఒక్కసారిగా టాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే సంవత్సరంలో ఇష్టమైన ముగ్గురిని కోల్పోయిన మహేష్ బాబు ఎలా కోలుకుంటాడో అని అంతా ఆయనకు ధైర్యం చెబుతూ వస్తున్నారు. తండ్రి మృతి తర్వాత.. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక మహేష్ బాబు మదనపడుతున్నారు. ఎట్టకేలకు ఆయన ట్విట్టర్ వేదికగా తన మనసులోని బాధను తెలియజేస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు.

మహేష్ సోషల్ మీడియా వేదికగా.. జీవించి ఉన్నప్పుడు కాదు, మరణించిన అనంతరం కూడా మీ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప విషయం. మీరు భయం లేకుండా డేరింగ్, డాషింగ్‌గా జీవితాన్ని గడిపారు. అదే మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్ఫూర్తి, ధైర్యం. అన్ని విషయాల్లో నేను మిమ్మల్ని అనుసరించాను. కానీ, ప్రస్తుతం అవన్ని లేవు. అయినప్పటికి, నేను భయం లేకుండా ఉన్నాను. మీరిచ్చిన ధైర్య సాహసాలు ఎప్పటికి నాతోనే ఉంటాయి. మీ వారసత్వాన్ని నేను ఎప్పుడు ముందుకు తీసుకువెళుతుంటాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న. నా సూపర్ స్టార్ మీరు.. అంటూ మహేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయ్యింది.

Mahesh Babu rains love showers on his dad Krishna:

Mahesh Babu memoria on his dad Krishna

Tags:   MAHESH BABU, KRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ