Advertisementt

RC15: వీటి బదులు ఫస్ట్ లుక్ ఇవ్వొచ్చుగా

Thu 24th Nov 2022 01:55 PM
ram charan,rc 15,dil raju  RC15: వీటి బదులు ఫస్ట్ లుక్ ఇవ్వొచ్చుగా
RC15: Ram Charan rage with a new look RC15: వీటి బదులు ఫస్ట్ లుక్ ఇవ్వొచ్చుగా
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మూడు భాషల్లో శంకర్ దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. దిల్ రాజు భారీగా నిర్మిస్తున్న RC 15 మొదటి షెడ్యూల్ నుండే రామ్ చరణ్ లుక్స్ లీకుల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. రామ్ చరణ్ లుంగీ కట్టి సైకిల్ తొక్కుతున్న లుక్, అంజలితో ఫ్యామిలీ పిక్, స్టూడెంట్ లుక్ ఇలా చాలా లుక్స్ లీకై వైరల్ అయ్యాయి. మధ్యలో రామ్ చరణ్ RC15 లుక్ లోనే పబ్లిక్ లో కనిపిస్తున్నాడు.

తాజాగా రామ్ చరణ్ RC15 లుక్ ఫొటోస్ ని వదిలారు మేకర్స్. కానీ అవి అఫీషియల్ గా సినిమాలో లుక్స్ కావు. ఆయన RC15 సెట్స్ లో హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ అలీమ్ తో ముచ్చటిస్తున్న పిక్స్. వాటినే మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే మెగా ఫాన్స్ ఇలాంటి లుక్స్ వదిలి అంచనాలు పెంచడం కాదు, RC15 నుండి చరణ్ లుక్ ఇవ్వండి బాస్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ లుక్ లో చరణ్ ని చాలాసార్లు చూసేసాం.. సినిమాలో ఎలా ఉంటాడో చూపించండి.

మాకు RC 15 టైటిల్ తో పాటుగా, రామ్ చరణ్ లుక్ కూడా ఇస్తే మేము ఓ రేంజ్ లో వైరల్ చేస్తామంటూ శంకర్ ని మెగా ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇండియన్ 2 కారణంగా RC15 ఇప్పుడు వచ్చే ఏడాది నుండి 2024 కి షిఫ్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అందుకే లుక్ విషయం లో, టైటిల్ విషయంలో మేకర్స్ గప్ చుప్ గా ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది.

RC15: Ram Charan rage with a new look:

Ram Charan new look creates a rage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ