Advertisementt

కాబోయే భర్త తో హన్సిక: పెళ్లి వేడుకలు షురూ

Wed 23rd Nov 2022 08:34 PM
hansika,sohail kathuria,hansika- sohail kathuria  కాబోయే భర్త తో హన్సిక: పెళ్లి వేడుకలు షురూ
Hansika-Sohael wedding celebrations underway కాబోయే భర్త తో హన్సిక: పెళ్లి వేడుకలు షురూ
Advertisement
Ads by CJ

హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకోబోతుంది. ప్రేమించిన ప్రియుడు సోహైల్ కతూరియా ని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. డిసెంబర్ 4 న రాజస్థాన్, జైపూర్ ప్యాలెస్ లో హన్సిక వివాహం సోహైల్ కతూరియా తో జరగబోతుంది. ఇప్పటికే హన్సిక పెళ్లి పనులు మొదలు కావడమే కాదు, సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. తన స్నేహితురాలి భర్త నే హన్సిక వివాహమాడబోతుంది. స్నేహితురాలితో విడాకుల తర్వాత హన్సిక సోహైల్ కతూరియా తో ప్రేమ లో పడి పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. హన్సిక పెళ్ళికి ఎవరిని పిలవడం లేదు. చాలాకొద్దిమంది ప్రముఖులకు మాత్రమే హన్సిక వివాహ ఆహ్వానాలు అందాయి.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యనే హన్సిక వివాహం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే హన్సిక పెళ్లి వేడుకలని ప్రముఖ ఓటిటి సంస్థ ప్రచారం చేయనుంది అని తెలుస్తుంది. ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ సెర్మోని, అలాగే మెహిందీ, సంగీత్ ఫంక్షన్స్ తో పాటుగా.. హన్సిక - సోహైల్ కతూరియా ల వెడ్డింగ్ ఫొటోస్, అలాగే వీడియోస్ ని ఆ ఓటిటి ద్వారా మాత్రమే వీక్షించాలట. 

హన్సిక ఇప్పటికే పెళ్లి కూతురు గెటప్ లో మెరిసిపోతుంది. తనకి జరగబోయే పెళ్లి వేడుకలకి సర్వం సిద్ధమంటూ సిగ్నల్స్ ఇస్తుంది. తాజాగా హన్సిక తనకి కాబోయే భర్త సోహైల్ కూతురియా తో పాటుగా తన సోదరుడితో దిగిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది కాస్తా వైరల్ అయ్యింది.

Hansika-Sohael wedding celebrations underway:

Hansika wedding ceremony started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ