Advertisementt

కథలు వినకుండా నాగ్ ఏం చేస్తున్నారు

Wed 23rd Nov 2022 10:31 AM
nagarjuna,bigg boss 6  కథలు వినకుండా నాగ్ ఏం చేస్తున్నారు
What is Nagarjuna doing without listening to stories? కథలు వినకుండా నాగ్ ఏం చేస్తున్నారు
Advertisement
Ads by CJ

నాగార్జున ద ఘోస్ట్ సినిమా తర్వాత పబ్లిక్ లో కనిపించ లేదు. అటు కృష్ణంరాజు గారు, ఇటు కృష్ణగారు మరణించినా నాగార్జున వారి పరామర్శకు రాలేదు. మరోపక్క ఘోస్ట్ తర్వాత ఓ ఆరు నెలల గ్యాప్ తీసుకుంటాను అంటూ చెప్పిన నాగార్జున తన దగ్గరకు వచ్చే దర్శకులు చెప్పే కథలు వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుస్తుంది. తనకి నప్పే కథలు ఏమైనా ఉంటాయా అని నాగార్జున కథలు విని సెలక్ట్ చేసుకుంటే ఓకె.. ఆలా కాదు కొన్నాళ్ళు విరామం అంటూ చెప్పి సైలెంట్ అవడం వెనుక కారణాలు కనిపించకపోయినా.. వారం వారం బుల్లితెర షో బిగ్ బాస్ కి నాగార్జున క్రమం తప్పకుండా వచ్చేస్తున్నారు. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకుతూ.. ఫన్ జనరేట్ చేస్తూ.. వాళ్లతో గేమ్స్ ఆడిస్తూ నాగార్జున స్టార్ మా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేస్తున్నారు. సినిమాల విషయమై ఇంకా నాగ్ ఓ డెసిషన్ కి రానట్టుగా ఉంది. అందుకే కథలు కూడా వినాలనిపించక కామ్ గా ఉన్నారేమో. మరి ఈసారి సినిమా చేస్తారో.. లేదంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.

What is Nagarjuna doing without listening to stories?:

Nagarjuna movie update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ