లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో సత్తా చాటుతున్న సమంత లేటెస్ట్ గా నటించిన చిత్రం యశోద. సరోగసి పద్దతిలో ప్రెగ్నెంట్ లేడీ గా యాక్షన్ చూపించిన సమంత ఈ సినిమాలో అండర్ కవర్ పోలీస్ గా స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఆ ప్రాసెస్ లోనే సమంత విలన్స్ తో ఫైట్స్ చేసింది. అంత సాహసం చేసిన సమంత ఆ సినిమాతో హిట్ అందుకుంది. సమంత ప్రస్తుతం మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. అందుకే ఆమె యశోదని ప్రమోట్ చెయ్యడానికి పబ్లిక్ లోకి రాలేకపోయింది. కానీ యశోద కోసం ఆమె పర్సనల్ గా ఇంటర్వూస్ ఇచ్చింది.
అయితే నవంబర్ 11 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా విడుదలైన యశోద కలెక్షన్స్ పరంగా, సమంత స్టామినాతో మంచి ఫిగర్ నే నమోదు చేసింది. థియేటర్స్ లో హిట్ అనిపించుకున్న యశోద ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. యశోద డిజిటల్ హక్కులని మంచి డీల్ తో అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా డేట్ ఇవ్వకపోయినా.. డిసెంబర్ రెండో శుక్రవారం యశోద అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది అంటున్నారు.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది అని తెలుస్తుంది.