గాడ్ ఫాదర్ హిట్ తో మంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. వాల్తేర్ వీరయ్యని సంక్రాంతికి విడుదల చేసేందుకు టీమ్ కష్టపడుతుంది. అందులో భాగంగానే సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసి.. మాస్ సాంగ్ అంటూ వాల్తేర్ వీరయ్య పార్టీ సాంగ్ ని ప్రమోట్ చేస్తుంది. మెగాస్టార్ తో హీరో రవితేజ వెయ్యబోయే మాస్ స్టెప్స్ కి బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కాలు కదపబోతుంది. ఆమె అందాలు ఈ సాంగ్ కె హైలెట్ అవ్వబోతున్నాయి.
ఈ సాంగ్ ప్రోమోని నేను విడుదల చేసింది టీమ్. అయితే వాల్తేర్ వీరయ్య స్పెషల్ సాంగ్ లో వీరయ్యగా చిరు వేసిన మాస్ స్టెప్స్ ని చిరు తమ్ముడు, టాప్ హీరో పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసారు. ఆ విషయాన్ని పిక్స్ తో మేకర్స్ ప్రకటించారు. అన్న చిరు, పవన్ కళ్యాణ్, దర్శకుడు బాబీ ఉండగా.. పవన్ కళ్యాణ్ వాల్తేర్ వీరయ్య సాంగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ అవి. ఆ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ పొలిటికల్ లుక్ లో ఉండగా.. చిరు వాల్తేర్ వీరయ్య లుక్ లో ఉన్నారు.
ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఆయన గొప్ప పాజిటివ్ పర్శన్, ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం అని ట్వీట్ చేశారు బాబీ.
మరి వాల్తేర్ వీరయ్య సెట్స్ లో పవన్ కళ్యాణ్ ని చూస్తే మెగా ఫాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ.