బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సోషల్ మీడియా క్వీన్. తరచూ గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకి కిక్ ఇస్తుంది. గత నాలుగు రోజులుగా కియారా గ్లామర్ లుక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. క్లివేజ్ అందాలతో యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్న కియారా లేటెస్ట్ గా వైట్ డ్రెస్ లో బోల్డ్ బ్యూటీగా షాకిచ్చింది. ఆ లుక్ తో మరింతగా సెగలు రేపుతోంది. వైట్ కలర్ మోడరన్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో కైపెక్కిస్తున్న చూపులతో కియారా అద్వానీ అందాలు అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. అందాలను ఆరబోసే విషయంలో కియారా అస్సలు పొదుపు పాటించదు అనే సూత్రాన్ని అప్లై చేస్తుంది.
ప్రస్తుతం సౌత్ లో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి మూడు లాంగ్వేజ్ ల్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ తో పాటుగా.. బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ ల్లో నటిస్తున్న కియారా అద్వానీ.. ఈమధ్యన విజయ్ దేవరకొండ చేసిన సెరా యాడ్ విపరీతంగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా కియారా పాప తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసేందుకు సిద్దమవుతుంది, ఈ డిసెంబర్ లోనే వాళ్ళ పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నా ఈ జంట మాత్రం గప్ చుప్ గా ఉంది.