Advertisementt

మంచు విష్ణుకి సుధీర్ కి పోలికలు

Tue 22nd Nov 2022 01:55 PM
manchu vishnu ginna,sudheer gaalodu  మంచు విష్ణుకి సుధీర్ కి పోలికలు
Ginna vs Gaalodu మంచు విష్ణుకి సుధీర్ కి పోలికలు
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా కొన్నాళ్లుగా సక్సెస్ లు లేకపోయినా గతంలో ఢీ, దూసుకెళ్తా లాంటి చిత్రాలతో హీరోగా నిరూపించుకున్నాడు. కానీ కొన్నేళ్లుగా సక్సెస్ కి దూరమైన మంచు విష్ణుకి జిన్నా టాక్ ఊరటనిచ్చింది. క్రిటిక్స్ నుండి జిన్నా మూవీకి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ.. జిన్నాకి అనుకున్న కలెక్షన్స్ రాలేదు. మంచు హీరోలపై ప్రేక్షకుల్లో ఉన్న నెగిటివిటి కారణంగానే హిట్ అయిన సినిమాకి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం అనుకున్నారు.

అదలా ఉంటే నిన్నగాక మొన్న శుక్రవారం రిలీజ్ అయిన సుడిగాలి సుధీర్ గాలోడు మూవీకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడం, క్రిటిక్స్ గాలోడుని ఏకిపడేసి.. దారుణమైన రేటింగ్స్ ఇచ్చినా కలెక్షన్స్ పరంగా గాలోడు దూసుకుపోతుంది. మొదటి రోజే గాలోడు ఆంధ్రాలో 36 లక్షలు సీడెడ్ లో ,18 లక్షలు నైజాంలో, అయితే ఏకంగా 47 లక్షలు బాక్స్ ఆఫీస్ వసూళ్లతో ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు కోటి పైన కలెక్షన్ రాబట్టింది. కానీ మంచు విష్ణు జిన్నా మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ గ్రాస్ కలెక్షన్ ఇంచుమించు 70 లక్షలు.. గాలోడు ఒక్క రోజులో కొల్లగొట్టిన కలెక్షన్స్ మంచు విష్ణు ఆల్ టైం జిన్నా కలెక్షన్స్ కన్నా ఎక్కువ అంటూ పోలికలు పెట్టేస్తున్నారు సినీ జనాలు. 

సుధీర్ గాలోడు మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి నిర్మాతలకు ప్రాఫిట్ స్టార్ట్ అయ్యింది. అయితే మంచు విష్ణుకి కలెక్షన్స్ కన్నా హిట్ అనే పదం ముఖ్యం. సక్సెస్ కొడితే చాలు, కలెక్షన్స్ అక్కర్లేదు అన్న టైప్ లో జిన్నా సక్సెస్ ని ఎంజాయ్ చేసారు మంచు ఫ్యామిలీ మెంబెర్స్.

Ginna vs Gaalodu:

Manchu Vishnu Ginna vs Sudheer Gaalodu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ