బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. 21 మంది హౌస్ లోకి అడుగుపెట్టగా.. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిదిమంది మిగిలారు. గత రాత్రి నామినేషన్స్ లో కీర్తి-కెప్టెన్ రేవంత్ తప్ప మిగతా వారు అంటే శ్రీహన్, శ్రీ సత్య, ఇనాయ, రాజ్, ఫైమా, ఆది రెడ్డి, రోహిత్ లు నామినేట్ అయ్యారు. అయితే ఇప్పడు బిగ్ బాస్ హౌస్ లో ఆల్మోస్ట్ టాస్క్ లు కూడా ముగిసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఈ వారం, ఫ్యామిలీ వీక్ అంటూ ఫ్యామిలీ ఎమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో ఈ ఫ్యామిలీ వీక్ ఎమోషన్స్ బిగ్ బాస్ కి బాగా హెల్ప్ అయ్యాయి.
హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబెర్స్ హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే.. ఏడుస్తూ, నవ్వుతూ.. ఎంజాయ్ చేస్తూ అందరిలో ఆసక్తిని కలిగించేవారు. బిగ్ బాస్ లో ఈ ఫ్యామిలీ వీక్ హిట్ కూడా అయ్యింది. ఇక సీజన్ 6 లో ఈ వారం ఫ్యామిలీ మెంబెర్స్ రాక ని షురూ చేసింది బిగ్ బాస్. ఫ్యామిలీ ఎమోషన్స్ వీక్ లో ముందుగా ఆది రెడ్డి వైఫ్ కవిత, ఆయన కూతురు అడుగుపెట్టారు. ఆది రెడ్డి పట్టలేనంత ఆనందంతో బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పడమే కాదు, కూతురు బర్త్ డే ని హౌస్ లో సెలెబ్రేట్ చేసినందుకు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. భార్య పాప తో ఇల్లంతా తిరుగుతూ సందడి చేసాడు.
కూతురితో కేక్ కట్ చేయించిన ఆది రెడ్డి బిగ్ బాస్ కి జీవితాంతం రుణపడి ఉంటా అన్నాడు. ఇక ఈ రోజు ఆది రెడ్డి ఫ్యామిలీ హౌస్ లోకి వచ్చిన ప్రోమో వదిలింది స్టార్ మా. అది రెడ్డి ఫ్యామిలీ ఎమోషన్స్ తో రేవంత్ తన భార్యని తలచుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత రాబోయే కుటుంబ సభ్యులతో హౌస్ మేట్స్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీ అందరిలో మొదలయ్యింది.