టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. వరసగా మూడు హిట్స్ కొట్టేసి యంగ్ హీరోలకి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఉప్పెన, శ్యామ్ సింఘ రాయ్, బంగార్రాజు హిట్స్ తర్వాత వరసగా మూడు ప్లాప్స్ పడినాయి. అది కూడా ఈ ఏడాదే.. నితిన్ తో మాచర్ల నియోజక వర్గం, రామ్ ద వారియర్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టింది. అయినప్పటికీ.. కృతి శెట్టికి ఆఫర్స్ కి కొదవలేదు. తెలుగు, తమిళ, మలయాళం లో నటిస్తూ మస్త్ బిజీగా మారింది.
ఇప్పుడు తెలుగులో మరో యంగ్ హీరో కృతికి అవకాశం ఇచ్చాడంటున్నారు. మార్చ్ ఆ టైమ్ లోనే కృతి శెట్టితో శర్వా మూవీపై చర్చలు జరిగాయన్నారు. ఇప్పుడు ఒకే ఒక జీవితంతో మంచి హిట్ కొట్టిన శర్వానంద్ తదుపరి మూవీ ని ప్రకటించబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి శర్వానంద్ మూవీ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సినిమాలోనే కృతి శెట్టి కి శర్వానంద్ అవకాశం ఇచ్చాడని, కృతి శెట్టి కూడా ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వరసగా ప్లాప్స్ అందుకున్న కృతి శెట్టికి యంగ్ హీరోల నుండి డిమాండ్ మాత్రం తగ్గలేదు.