Advertisementt

జబర్దస్త్ పంచ్ ప్రసాద్ హెల్త్ అప్ డేట్

Tue 22nd Nov 2022 10:28 AM
jabardasth,comedian punch prasad  జబర్దస్త్ పంచ్ ప్రసాద్ హెల్త్ అప్ డేట్
Jabardasth Punch Prasad Health update జబర్దస్త్ పంచ్ ప్రసాద్ హెల్త్ అప్ డేట్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే మొన్నామధ్యన పంచ్ ప్రసాద్ కి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత అతను కోలుకుని మళ్ళీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై కామెడీ చేస్తున్నాడు. అతని భార్య పంచ్ ప్రసాద్ ని ఎంత బాగా చూసుకుంటుందో ఆమె ఏమేమి త్యాగాలు చేసిందో కూడా పంచ్ ప్రసాద్ పలు సందర్భాల్లో చెప్పాడు అయితే తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరోసారి దెబ్బతింది. ఆయన ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నట్లుగా మరో కమెడియన్ నూకరాజు చాటుగా వీడియో తీసి  పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ లోనే షేర్ చెయ్యగా.. అతనికి నడుము దగ్గరనుండి కుడికాలు వరకు చీము పట్టడంతో అతని పరిస్థితి బాలేదు, అందుకే నడవలేకపోతున్నాడు అని చెప్పాడు.

దానితో అతను కోలుకోవాలంటూ కామెడీ ప్రియులు దైర్యం చెప్పారు. మరోసారి ప్రసాద్ హెల్త్ పై ప్రసాద్ ఫ్యామిలీ ఓ ఛానల్ కి అప్ డేట్ ఇచ్చారు. పంచ్ ప్రసాద్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది అని, అతను మరో వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ లేచి నడవగలడని, ప్రస్తుతం అతనికి ఓ నర్స్ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తూ సెలైన్స్ పెడుతున్నారు, ప్రసాద్ కి అలాంటి భార్య దొరకడం అదృష్టం, పంచ్ ప్రసాద్ కి సెలైన్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పోయేలా చేస్తున్నారు, కొద్దిరోజుల్లోనే ప్రసాద్ లేచి మాములుగా నడుస్తాడంటూ వారు చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Jabardasth Punch Prasad Health update :

Jabardasth Comedian Punch Prasad Health update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ