హీరోయిన్ నిత్యా మీనన్ ఈమధ్యన తరచూ పెళ్లి వార్తలతోనే ఎక్కువగా హైలెట్ అవుతుంది. నటిగా నిరూపించుకునే అవకాశాలను మాత్రమే స్వీకరించే నిత్యా మీనన్ కి ఆమె బరువు కారణంగా ఆమె కలలు కన్న, కావాలనుకున్న పాత్రలు చాలాసార్లు మిస్ అయ్యాయి. ఇక నటిగా గుర్తింపునిచ్చే పాత్రలతో నిరూపించుకున్న నిత్యా మీనన్ ఆ మధ్యన డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి కూడా అడుగుపెట్టింది. రీసెంట్ గా ప్రెగ్నెంట్ లేడీ గా ఓ వెబ్ సీరీస్ లో నటించింది. వండర్ వుమన్ వెబ్ సీరీస్ తో త్వరలోనే ప్రేక్షకులని పలకరించబోతుంది.
ఆ ప్రమోషన్స్ లో భాగంగానే నిత్య మీనన్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్యన నిత్య మీనన్ పెళ్లి చేసుకోబోతుంది, వరుడు వివరాలను ఇవే అంటూ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చెయ్యగా.. ఆ రూమర్స్ ని నిత్య మీనన్ గట్టిగా తిప్పికొట్టింది. అయితే పెళ్లి అనేది ఓ సోషల్ సెటప్ అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడింది. నేను ఆచార సంప్రాదయాలకు విలువనిచ్చే అమ్మాయిని, పక్కా ట్రెడిషనల్ గర్ల్ ని. పెళ్లంటే ఓ సోషల్ సెటప్. అంటే ఫైనాన్షియల్ విషయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం.
నాకు మాత్రం అలాంటి సెక్యూరిటీ లేదు. అంతకు మించి ఏమైనా ఉంటే ఆలోచిస్తాను. దానికి మించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ నిత్య మీనన్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.