Advertisementt

చిరుకి తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన PM మోడీ

Mon 21st Nov 2022 05:45 PM
pm modi,chiranjeevi  చిరుకి తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన PM మోడీ
PM Modi praises Chiranjeevi for his achievement చిరుకి తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన PM మోడీ
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ని ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించడంతో.. ఆయనకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయనాయకుల దగ్గరనుండి, సినీ ప్రముఖుల వరకు ఆయనని అభియనందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా తండ్రికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కడం పట్ల తాను పొందిన ఆనందాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ రూపం లో తెలియజేసాడు. అయితే చిరు ఈ ఏడాది ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కడం పై మన దేశ ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చెయ్యడమే కాదు.. చిరు కోసం తెలుగులో ట్వీట్ చెయ్యడం అందరిని ఆకర్షించింది.

చిరంజీవి గారు ఆయనకి ఆయనే సాటి. ఆయన అద్వితీయమైన నటన, విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తిత్వం కొన్ని తరాల సినీ ప్రేమికులకు ఆయన్ని దగ్గర చేశాయి. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవాలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్న ఆయనకి అభినందనలు. చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు అంటూ తెలుగులో ట్వీట్ చేసారు.

దానికి చిరు కూడా అంతే ప్రేమతో రిప్లై ఇస్తూ.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీగారు, దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీ గొప్ప మాటలకు నా ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్ చేసారు.

PM Modi praises Chiranjeevi for his achievement:

PM Modi congratulates Chiranjeevi 

Tags:   PM MODI, CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ