NTR30 పై చిన్న చిన్న అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. NTR30 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలైనట్టుగా కొరటాల శివ-సాబు సిరిల్-రత్నవేలు మీటింగ్ పెట్టి ముచ్చటిస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకలొచ్చేశాయి. అసలే ఏడెనిమిది నెలలుగా ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో ఫాన్స్ ఆకలితో ఉన్నారు. కానీ ఎన్టీఆర్-కొరటాల మాత్రం NTR30 మొదలు పెట్టడం లేదు.
నిన్న ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో కొరటాల NTR30 మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్న పిక్స్ షేర్ చేసారు. దానిని కూడా లైక్స్, షేర్స్ అంటూ హడావిడి చేసిన ఫాన్స్ ఓ విషయంలో డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న అప్ డేట్స్ వద్దు.. మాకు NTR30 ముహూర్తపు తేదీ ఇవ్వండి, NTR30 మొదలయ్యే డేట్ పై క్లారిటీ ఇవ్వండి సామీ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్-యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.
అందుకే ఈ సినిమా లాంచ్ డేట్ కోసం ఫాన్స్ అంతగా పట్టుబడుతున్నారు. అసలే ఎన్టీఆర్ అన్న షూటింగ్స్ లో పాల్గొని ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు ఏదో యాడ్ షూట్ అన్నారు కానీ, అది ఇంకా రివీల్ అవ్వలేదు. కనీసం NTR30 ఎప్పుడు మొదలవుతుందో అప్ డేట్ ఇస్తే కాస్త బావుంటుంది అంటూ మేకర్స్ పై పడుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.