Advertisementt

దృశ్యం 2: వాళ్ళకి క్యాష్.. వీళ్ళకి లాస్

Mon 21st Nov 2022 02:41 PM
drishyam 2,ajay devgn,tabu  దృశ్యం 2: వాళ్ళకి క్యాష్.. వీళ్ళకి లాస్
Ajay Devgn Drishyam 2 creates havoc at box offic దృశ్యం 2: వాళ్ళకి క్యాష్.. వీళ్ళకి లాస్
Advertisement
Ads by CJ

మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ దృశ్యం సీరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. మలయాళం దృశ్యం సీరీస్ తో తెలుగులో వెంకీ, తమిళ్ లో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ లు రీమేక్స్ చేస్తూ హిట్స్ అందుకున్నారు. మలయాళంలో దృశ్యం 2 కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఓటిటిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ రాగానే.. టాలీవుడ్ హీరో వెంకటేష్ దృశ్యం 2 ని రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించడమే కాదు.. చకచకా పూర్తి చేసి దానిని కూడా ఓటిటిలోనే రిలీజ్ చేసారు. అయితే అప్పట్లో కరోనా లాక్ డౌన్ పరిస్థితిలు అలా ఉన్నాయి. 

కానీ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ మాత్రం దృశ్యం 2 ని థియేటర్స్ లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకోవడమే కాదు, బాలీవుడ్ ని మళ్ళీ పైకి లేపాడు. కొన్నాళ్లుగా బాలీవుడ్ మూవీస్ హిట్ అవక.. BoyCottBollywood హాష్ టాగ్ తో బాలీవుడ్ అతలాకుతలం అవుతున్న సమయంలో అజయ్ దేవగన్ మలయాళం దృశ్యం రీమేక్ తో మంచి హిట్ కొట్టడమే కాదు.. మూడు రోజుల్లోనే 64కోట్ల కొల్లగొట్టాడు. ఫస్ట్ వీక్ ముగిసేసరికి 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ నిపుణులు.

అయితే మోహన్ లాల్, వెంకటేష్ లు దృశ్యం 2 ని థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో రిలీజ్ చేసి థియేటర్స్ రెవిన్యూ ఎంతగా లాస్ అయ్యారో.. హిందీ దృశ్యం 2 థియేట్రికల్ కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. దృశ్యం 2 రీమేక్ తో హిందీ వాళ్ళు క్యాష్ చేసుకుంటే.. ఒరిజినల్ కథతో మోహన్ లాల్, రీమేక్ తో వెంకటేష్ లాస్ అయ్యారు. ఆ సినిమాలకి మంచి ఓటిటి డీల్ వచ్చినా.. ఈ థియేట్రికల్ కలెక్షన్స్ లాస్ అయినట్లే కదా.

Drishyam 2 Trailer

Ajay Devgn Drishyam 2 creates havoc at box offic:

Drishyam 2 box office: Ajay Devgn, Tabu film crosses ₹64 cr in 1st weekend  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ