Advertisementt

కూతురికి క్యూట్ గా విషెస్ చెప్పిన అల్లు అర్జున్

Mon 21st Nov 2022 01:34 PM
allu arjun,allu arha  కూతురికి క్యూట్ గా విషెస్ చెప్పిన అల్లు అర్జున్
Allu Arjun cute birthday wishes to daughter Allu Arha కూతురికి క్యూట్ గా విషెస్ చెప్పిన అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

స్టార్ కిడ్స్ లో మోస్ట్ పాపులర్ కిడ్స్.. మహేష్ కూతురు సితార, అల్లు అర్జున్ కూతురు అర్హ లే. ఎందుకంటే ఈ ఇద్దరూ తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న క్రేజీ పిల్లలు. అల్లు అర్హ చిన్నప్పటి నుండే కూతురు అల్లరిని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇస్తుండేవారు. ఈ రోజు అల్లు అర్హ బర్త్ డే. కూతురు పుట్టిన రోజు నాడు అల్లు అర్జున్ ఓ క్యూట్ వీడియో ని షేర్ చేస్తూ అందులో కందిరీగ కథ చెబుతూ కూతురికి బర్త్ డే విషెస్ తెలియజేసాడు.

అల్లు అర్హ ని ఏముందక్కడ అని అల్లు అర్జున్ అడగ్గానే.. ఆ కందిరీగలు నా జుట్టులోకి వెళుతున్నాయి.. అంది అర్హ. ఆ పుట్ట ఎక్కడుంది. అక్కడే కింద ఉంది.. పొగ పెట్టి ఏం తీశారు అనగానే.. తీసినారు అంది అర్హ. ఏం తీసినారు.. తెలంగాణ మాట్లాడుతున్నావ్ అని ముద్దు చేసాడు అల్లు అర్జున్. ఎందుకు భయపడుతున్నావ్ అనగానే ఆ కందిరీగలు కుడుతున్నాయ్ అంది.. అవి ఎక్కడున్నాయి కింది ఫ్లోర్ లో అంది అర్హ.. ఆ వీడియో ని షేర్ చేస్తూ కూతురికి స్వీట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసాడు అల్లు అర్జున్.

Allu Arjun cute birthday wishes to daughter Allu Arha:

Happy Birthday Allu Arha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ