బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ వీక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండాల్సింది పోయి.. మరీ చప్పగా తయారయ్యాయి. నాగార్జున ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్ట్ కలిగించడం లేదు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు చెబుతున్న మాట. ఈ వీకెండ్ లో ఆది రెడ్డి ని టార్గెట్ చేసిన నాగార్జునాన్ రేవంత్ ని స్మూత్ గా మందలించడం పై ఓ వర్గం ఆడియన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఆది రెడ్డి చేసిన ఓ మిస్టేక్ ని పట్టుకుని నాగార్జున ఆయనని అంతలా మట్లాడాల్సింది కాదు అంటుంటే.. ఆదిరెడ్డి కూడా అంతలా నాగార్జున ని పాయింట్ అవుట్ చెయ్యడం పెద్దగా ఆకట్టుకోలేదు అంటున్నారు.
ఇక ఆదివారం ఎపిసోడ్ లో మరీనా ఎలిమినేషన్ అయితే మరింత చప్పగా సాగింది. అసలు ఏ మాత్రం ఆసక్తి లేని ఎలిమినేషన్ ఇది. మరీనా ఎప్పుడో ఫస్ట్ వీక్స్ లోనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు ఆమె హౌస్ లో కొనసాగడం ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే.. ఆమెని ఎంతెలా బిగ్ బాస్ హౌస్ లో ఉంచారో అర్ధమవుతుంది. సూర్య, చంటి, గీతూ, బాలాదిత్య ఇలా వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా మరీనా లాంటి వాళ్ళు వెళ్ళాల్సింది. కానీ.. మరీనాని కేవలం ఆమె జంటగా రావడం అనే కారణంతోనే ఇన్నిరోజులు హౌస్ లో ఉంచారు.
మరీనా ఈ 11 వారాలకు హౌస్ లో ఉండేందుకు వర్త్ బుల్ కాదు అనేది బుల్లితెర ప్రేక్షకుల వాదన. ఇక స్టేజ్ పై కూడా మరీనా ఎలాంటి ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడలేదు.. గంటన్నర ఎపిసోడ్ గంటకే ముగించాల్సి వచ్చింది. అంటే 24 గంటల్లో ఓ గంట ఫుటేజ్ కూడా బిగ్ బాస్ కి రావడం లేదని దీనిని బట్టి అర్ధమవుతుంది.